గాలి పలకపై నీకై లేఖలు

గాలి పలకపై నీకై లేఖలు రాస్తే ఎన్ని పూల తోటలు ఈర్ష్య పడ్డాయో ఆ లేఖను చదివి,
ఇంత అందగత్తె ఎక్కడ ఉందని వెతకడానికి ఆ లేఖను వెంబడిస్తూ వెళ్ళాయి కదిలి,
ఆ ఉత్తరం స్వర్గాలను దాటి అద్భుత లోకాన్ని చేరుతుందేమో అని అనుకున్నాయి,
కానీ ఈ భూలోకాన్నే ఉన్న నిన్ను చేరుకోవడంతో నువున్న చోటే అద్బుతం అని తెలుసుకున్నాయి...

all the gardens become envious of you after reading the letter I wrote on the wind slate, 
They chased the letter to find out where such a beautiful woman is,
they were expecting that it may reach the sky and cross all the heavens,
to their despair it reached you on this earth,
So they realised your presence makes any place a wonderland and so you are a lovely woman....

💜💜

కలిగే కరిగే కదిలే

కలిగే కరిగే కదిలే..

It Happened with you,
You melted my heart,
We are moving together... 

💜💜

గులాబీతో ప్రేమలో

నా కళ్లలోకి కూడా చూడలేని ఆ గులాబీతో ప్రేమలో పడ్డాను. నా ప్రియతమా నువ్వు నా కళ్లలోకి చూస్తూ నీ ప్రేమను కురిపించావు నేను నీతో ప్రేమలో పడకుండా ఎలా ఉంటాను...

I fell in love with that rose which can't even look into my eyes, 
my dear you looked into my eyes and showered your love, how can I not fell in love with you...

💜

నువ్వు నా అద్ధానివి

You are my mirror who reflects everything that I do between us and you know what I love you...

నువ్వు నా అద్ధానివి నేను ఏమి చేసినా నాకు తిరిగి చూపెడతావు,
నీకొకటి తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నాను... 

💜

ముద్దొస్థావు

ప్రేమను చెప్పకుండా చుపించినప్పుడు నువ్వు చాలా ముద్దొస్థావు..

It's so cute when you show love without expressing it..

💜

రాత్రికి రంగు వేయడం తెలియదు

రాత్రికి రంగు వేయడం తెలియదు కానీ అంతా నల్లగా మారుతుంది, నీ మౌనానికి మోసగించడం తెలియదు కానీ నా మనసును తోలచివేస్తుంది...

Night doesn't color anything but everything at night appears dark,
Your silence doesn't mean to hurt but it tears down my heart...

💜

నీ స్వచ్ఛమైన ప్రేమ చాలు

ఒక పత్తి ముద్ద బలాన్ని కూడగట్టుకొని ఒక కొండలా మారిన ఒక నిప్పు రవ్వ చాలు లొంగిపోవటానికి,
నా బలం ఎంతున్నా కొండంత హృదయమున్నా రవ్వంత నీ స్వచ్ఛమైన ప్రేమ చాలు కరిగిపోవడానికి...

Even if a cotton ball gains all the strength to become a huge mountain it cannot resist a spark on it,
How much ever strong heart I have it always surrenders to your pure love..

💜

ఆకాశమే మీద పడుతుంటే

ఆకాశమే మీద పడుతుంటే లొంగిపోవడం తప్ప ఆపగలనా...

When the sky is falling, I can't resist except surrendering myself...

💜

అసలైన రంగు

ఆకాశానిది అసలైన రంగు ఏమిటో కానీ తను చూపించే ప్రతి రంగు బాగుంటుంది...

The exact colour of sky is unknown but whatever the colour it exhibits is magical...

💜

నీతో ముగుస్తుంది

రోజును రాతిరితో ముగించాలన్నది సృష్టి,
కానీ నా ప్రతి రోజు నీతో ముగుస్తుంది..

What god created is to end the day with night,
But what happened is to end evryday with you..

💜

చంద్రుడు మండడు

చంద్రుడు ఎంత ప్రయత్నించినా సూర్యుడిలా మండలేడు. చల్లటి కాంతిని చల్లడం లేదా దాగడం తప్ప మండటం తెలియదు..

However hard the moon try it cannot be as hot as the sun,
It doesn't know anything other than showering the cool light or hide itself but it never cause burns..

💜

నీతో నేను

ఎంత ముద్దాడిన గాలితో సాగదు పువ్వు,
ఎంత ముంచెత్తినా నీటిలో కరగదు ముత్యం,
కానీ గాలి లేనిదే పువ్వు ఆడదు,
సంద్రం లేనిదే ముత్యం కలగదు...

How much ever it kisses,
Flower doesn't fly with the wind,
How much ever it cares,
Pearl won't dissolve in Ocean's love,
But flower won't wiggle without wind,
Pearl cannot form without water..

💜

విచిత్రం

ఏమిటో ఈ విచిత్రం నిను చూడటానికి కనులు మూయాలి...

It is weird that I have to close my eyes to see you..

यह अजीब है कि मुझे आपको देखने के लिए अपनी आंखें बंद करनी पड़ती हैं

💜

తేనె చుక్కలు తుమ్మెదకై రెక్కలు కట్టి వెతికినట్టే

నీ మాట నాకు దొరికింది,
అంటే ఇసుక రాల్చే మేఘం ఎక్కడో ఉన్నట్టే ,
నీ చూపు నాపై పడింది,
అంటే వజ్రాలనిచ్చే చెట్టు ఎక్కడో ఉన్నట్టే, 
అపురూపమైన నీ ప్రేమ నాకై మనసు దాటి వచ్చింది ,
అంటే పువ్వులోని తేనె చుక్కలు తుమ్మెదకై రెక్కలు కట్టి వెతికినట్టే,
ఇంకా కలగట్లేదు నమ్మకం నాకు ,
కానీ నా ఈ అనుభవం అబద్ధం కాదు .... 


I got your word,
so there must a sand raining cloud somewhere,
your eyes fell on me,
so there must a tree that can bear gems.
Your incredible love is out for me,
so it's like honey dew flying to find it's right bee,
I still can't believe it,
But I am experiencing the wonders of your love..

💜

మేఘాలు ఎంత మెత్తనైనా

మేఘాలు ఎంత మెత్తనైనా చినుకును చేతితో తీయగలమా,
నీ మనసు ఎంత మెత్తనైనా అందులో నుంచి ప్రేమను తీయడం సాధ్యమా,
కురిసినప్పుడు తడవాలి మెరిసినప్పుడు ఆనందించాలి అందినప్పుడు దాచుకోవాలి...

No matter how soft the clouds are, 
can a drop be plucked by hand?, 
No matter how soft your heart is, 
is it possible to extract love from it?, 
Just get wet when it rains,
Enjoy when it shines,
Preserve it when it is yours...

💜

నీ చూపులు నా రోజుగా మారితే

నీ చూపులు నా రోజుగా మారితే, ఆ రోజు ఎప్పటికీ ముగియదు అని నాకు తెలుసు...

If your gaze turns to my day, I know the day never ends...

अगर आपकी निगाहें मेरे दिन में बदल जाती हैं, तो मुझे पता है कि दिन कभी खत्म नहीं होता ...

💜

నింగిలో ఎక్కువైన వెన్నలంతా

నింగిలో ఎక్కువైన వెన్నలంతా ఆ దేవుడు తీసేస్తుంటే ఒక చుక్క ఏమైనా చేజారి నీలా మారిందా? ....

Are you drop of moon light fell down when God is removing the excess of the light from the sky?

💜

ఎన్ని పూలు కావాలో నాపై దాడి చేయడానికి,

గొడవలో కూడా ప్రేమ చూపే నిన్ను ఏమనాలి,
పూలతో దాడి చేస్తుంటే ఏమనుకోవాలి,
ఎన్ని పూలు కావాలో నాపై దాడి చేయడానికి,
నా మనసా నీకెన్ని పూలు కావాలో నాపై దాడికి...

what to say when you are showing love even in the fight,
what to say when you are attacking with flowers,
how many flowers do you need,
my love how many flowers do you need...

💜

నడిచే కథలో గతమే ఉంటే

నడిచే కథలో గతమే ఉంటే గతమై పోయి నిను చేరుకుంటా....

If the past can be a part of the present story the I would go back and join you...

💜

అంతులేని ప్రయాణం అడుగులే వేయకుండా

కొలనులో ఈత కొడుతూ దాహం తీర్చుకోలేక,
వెలుగులో ఉండి కూడా నీడను చూడలేక,
కలలు నిజమౌతున్నా నిదురే లేక,
నీతో అంతులేని ప్రయాణం అడుగులే వేయకుండా...

Unable to quench thirst though swimming in the clean water pool,
under the light but unable to see the shadow,
all dreams came true but there is no sleep,
Endless journey with you without walking along with you...

💜

వ్యర్థమాయే ఆద్ధం

నువ్వు చూసుకునే ప్రతి అద్దం వృధా అయిపోతుంది, ఎందుకంటే అద్దం నీ ప్రతిమను విడిచిపెట్టదు మరియు మరెవరినీ ప్రతిబింబించదు.

every mirror that you see yourself is getting wasted, as the mirror never leaves your image though you leave it and not reflecting anyone else..

💜

మేఘాలకు తెలియదు

మేఘాలకు తెలియదు వర్షంలో తడిస్తే ఎలా ఉంటుందని కానీ కురుపిస్తాయి, ఒక్కసారి వాటివైపు చూడు నాలాగ అవి కూడా ఆ తడిసిన హాయిని అనుభవిస్తాయి..

Clouds don't know what it's like to get wet in the rain but they shower it, just look at them and let them enjoy the wet feeling that I have when you look at me...

💜

నీట మునిగితే బుడగ

నీట మునిగితే బుడగ,
నీ ప్రేమలో మునిగితే చక్కని భావం..

it is normal to get,
water bubbles when sinking in water,
a beautiful feeling when sinking in your love...

💜

నీటి బొట్టులో గూడు

 ఒక నీటి బొట్టులో గూడు కట్టి నీతో కలిసి ఉండగలను ఎందుకంటే నా చుట్టూ లోకం ఎంత చిన్నదైనా నీ మనసులో ప్రేమ వెవ్వేల రెట్లు పెద్దది.

I can nestle in a drop of water and be with you because no matter how small the world around me is, the love in your heart is a million times bigger.

मैं पानी की एक बूंद में बस सकता हूं और आपके साथ रह सकता हूं क्योंकि मेरे आसपास की दुनिया कितनी भी छोटी क्यों न हो, आपके दिल में प्यार लाख गुना बड़ा है।


💜

కనులు తెలివి

వేకువకు కనులే ఉంటే నేలను తాకక ముందు నిన్ను తాకుతుంది, 
చీకటికి తెలివే ఉంటే నింగిలోని నలుపును నీకు బదులిచ్చి నీ కురుల నలుపును అద్దుకుంటుంది...

If the first light got eyes, it will touch you before it touches the ground, if the night is intelligent, it will exchange it's darkness with colour of your hair...

💜

కాంతి నీడ

నీ ప్రేమను పొందడం అంటే కాంతి నీడను కనుగొనట్టే...

Gaining your love is like finding the shadow of the light..

💜

రెప్ప పాటు సమయమంతా వృధా

కనులార్పుతూ నిను చూస్తుంటే కలత చెందింది మనసు ఆ రెప్ప పాటు సమయమంతా వృధా అయ్యిందని...

my heart felt bad for blinking the eyes while looking at you as it missed you so much between the blinks..

💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...