భావాలకు చక్రాలు అక్కర్లేదు


నీ మాటలపై పయనించే నా భావాలకు చక్రాలు అక్కర్లేదు, ఏ ఘర్షణ లేకుండా అలా జారుకుంటూ సాగిపోతాయి, వేగంలో అదుపు అక్కర్లేదు, ఎందుకంటే అది అడ్డు లేని దారి లాంటిది..

My emotions ride on the words you speak, gliding effortlessly without friction. They keep their unhurried pace, as if journeying along an obstacle-free territory...

💜💜💜


నిర్మలంగా పారే నది అడుగున దాగిన మహా సంద్రం నువ్వు..

You are an ocean hidden beneath a calm river..

💜💜💜


మనసంతా ధారపోసిందని


నింగికెగిరి మబ్బును ముద్దాడే పువ్వు మనసులో ఉన్నది ప్రేమైనా సరే కోరికైనా సరే మొక్కను వదిలి అంత దూరం వెళ్లే సాహసం చేసినప్పుడే తెలిసింది తన మనసంతా ధారపోసిందని..

Whether it is love or lust, what is that in the heart of the flower that left the plant and flew to the sky to kiss the cloud, is pure involvement...

💜💜💜


కొన్నింటిని అనుభవించగలము కానీ వాటిపై ఆధారపడలేము




ఎత్తు నుంచి పడుతున్నప్పుడు నేల తగిలేదాక గాలి తగులుతున్నా సరే పట్టుకోలేము, కడదాక చుట్టూనే ఉన్నా కొన్నింటిని అనుభవించగలము కానీ వాటిపై ఆధారపడలేము...

Though one can feel the wind all around, it cannot be held while falling freely from height. A few things are not meant to be held, but we feel their presence around forever...

💜💜💜

కప్పిన పొరలను తీసి చూడు


ఆగినా కూడా గాలివాన, నీలి మేఘం కనిపించకుంటే, కళ్ళను నులిమి చూడు ఆ గాలివాన కప్పిన పొరలను తీసి చూడు, ప్రేమలోను అంతే, నిర్మలమైన మనస్సుతో చూడు, తీరనట్టు కనిపించే సమస్యలు ఎప్పుడో తీరిపోయుంటాయి...

If you can't see a clear sky after a storm, clean your eyes to see reality. In love as well, look at things with a clear heart, because most issues are already resolved, even if they seem to persist...

💜💜💜

నేను కూడా మెరిసే బిందువై మిగిలిపోవాలి



బురద నేలపై నీటి బిందువులు ఎన్నున్నా మెరవ్వు సరి కదా కనిపించవు కూడా, కానీ తామరాకుపై ఒక్క నీటి బిందువు ఉన్నా చాలు మెరుస్తూ ఉంటుంది,
సఖీ నీ ఆలోచనలో నేను కూడా మెరిసే బిందువై మిగిలిపోవాలి...

The water droplets on the muddy ground won't shine at all, but even a single droplet on the lotus leaf shines. Dear, I aspire to be the shiny droplet in your thoughts...

💜💜💜

నా ప్రతి అక్షరం నీకై ఎగురుతూనే ఉంటుంది

ఆవిరై మేఘాలను చేరే దాకా ఆగలేక రెక్కలు కట్టి ఎగిరిన కడలి చుక్కలా,
నీ చూపు తగిలేదాక ఆగకుండా నా ప్రతి అక్షరం నీకై ఎగురుతూనే ఉంటుంది..

Like a droplet flying with its wings, unable to stop until it evaporates and reaches the clouds,
Every letter of mine keeps flying to you without stopping...

💜💜💜



అన్నిట్లోకి చొచ్చుకొని పోతుంటే వజ్రం కఠినమైన వస్తువు ఏమో అని అనుకున్నాను, కానీ అదే వజ్రాన్ని నువ్వు అలంకరించుకుంటే ఈ విశ్వంలో కెల్లా అది మృదువైన వస్తువుగా తోస్తోంది...

When I see the diamond cutting through everything, I thought it was the hardest material in this world. But when I see that same diamond on you, I feel it has to be the softest one in this entire universe...

💜💜💜

అన్నీ ఎలా తెలుసుకోవాలి?

ఒకరిని అర్థం చేసుకునే ప్రయత్నంలో వారిని ప్రేమించడం మర్చిపోతాము, అదే ప్రేమించే ప్రయత్నం చేస్తే వారి గురించి అన్ని తెలుసుకోగలము...

In the attempt to get to know someone, we sometimes forget to love them. But in the attempt to love someone, you'll come to know everything about them...

💜💜💜

కొలిమికీ ఉంటాయి కోరికలు


కొలిమికీ ఉంటాయి కోరికలు ఆ పువ్వును తాకాక చల్లసాగాయి మంచు తూలికలు, మరి నేనెంత? చల్లుతున్నా ప్రతిచోట ప్రేమ మాలికలు... 

Even the burning furnace has desires, and it started throwing snowflakes after touching this flower. Needless to say I am throwing love everywhere..

💜💜💜

నిప్పులో మొలకెత్తిన పువ్వు నా ప్రేమ



నిప్పులో నాటితే మొలకెత్తిన పూల అందాన్ని ఏ వేడి కబళించగలదు? జ్వలించే నీ మనసులో పడి మొలకెత్తిన ప్రేమ నాది, 
నా ప్రేమను మరే మనసు కబళించలేదు...

What heat can devour the beauty of flowers that sprout when planted in the fire? Mine is the love that sprouted in your burning heart,
No other heart can take away my love...

💜💜💜

చంద్రయాన్ 3




ఎత్తున ఎగిరే జెండా, ఎత్తుకు వెళ్ళి ఎగురుతోంది,
విరబూయని మల్లె చెండు కొప్పులో, మువ్వన్నెల పువ్వులా రెపరెపలాడుతోంది...

A flag flying high, now flown higher,
and the tricoloured flag adorns the hair of the unbloomed wild jasmine...

❤️🇮🇳❤️

కొండమీద కుంట కొండ కింద చీమ


కొండమీద కుంటలో నీరులా నువ్వు, 
నేల మీద పుట్టలో చీమలా నేను,
నా దాహం ఎలా తీర్చుకోను,
నీ చెమ్మతో నా దాహం ఎలా తీర్చుకోను...

You are like water in the pond atop the hill, while I am like the ant at the foot of the hill. How can I quench my thirst from the pond?

💜💜💜

ఆపై ప్రేమ తప్ప ఇంకేమి ఉండదు



ప్రపంచంలో అందరి ప్రేమను పొందడం చాలా సులువు కానీ ప్రేమించాక కష్టాలు, 
నీ ప్రేమ పొందడం చాలా కష్టం కానీ పొందగలిగితే ఆపైన ప్రేమ తప్ప ఇంకేమి ఉండదు..

It's easy to gain the love of everyone in this world but challenges will be there later,
it's very challenging to gain your love, if one gets then the rest is only love..

💜💜💜

వేకువ కిరణంలా


వేకువ కిరణంలా అతి సున్నితమైనది నీ ప్రేమ కానీ ఆ కిరణంలోని వేడికంటే వెయ్యిరెట్లు తీవ్రత ఉంటుంది..

Your love is tender as morning's first rays, yet a thousand times more intense than it in all the ways...

💜💜💜

తిరిగి పొందలేవు కానీ పంచుకో నీ అనుభవం


ఎంత జిగురు వాడినా బూడిద మళ్ళీ కట్టె ముక్క కాదు, కట్టె ముక్క మళ్ళీ చెట్టు కాలేదు, కానీ అదే బూడిదను ఎరువులా వాడితే ఎన్నో చెట్లకు ఊతమిస్తుంది, తీరిపోయిన నీ అనుభవాలను తిరిగి పొందలేవు, నలుగురికి పంచితే అది వారి జీవితాలకు చక్కటి మార్గం వేస్తుంది...

No matter how much glue is used, ash can't be turned into a piece of wood anymore; pieces of wood can't be a tree anymore. However, if the same ash is used as fertilizer, it will give life to many trees. You will not be able to recover your exhausted experiences, but if you distribute them to others, it will pave a better way for their lives...

💜💜💜

మునగకుండా పడుండాలి





ప్రేమలో పడకుండా మునిగి తప్పు చేశాను,
పడుంటే నాకు మట్టుకే దెబ్బ తగిలి ఉండేది,
మునగడం వల్ల నాతోపాటు నన్ను ముంచిన మనసు కూడా బాధపడుతోంది..

I made a mistake by drowning in love. Instead, I could have fallen into it. By falling, I might have injured myself, but now I'm causing the heart I drowned to suffer as well...

💜💔💜

నీ అందం ఒక సైనిక దళం



నీ అందం మనోహరం కాదు ఒక సైనిక దళం,
నాపై ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటుంది,
ఎంత ఎదురించినా కనీసం ఆ యుద్ధ భూమిలో అడుగు కూడా వేయలేనంతగా దాడి చేస్తోంది....

Your beauty isn't charming; it's a soldier force, always ruthlessly attacking me. No matter how hard I try, it assaults me relentlessly, making it impossible for me to set foot on the battlefield...

💜💜💜


నిశబ్దం


జీవితాంతం వినిపించగల నీ నిశబ్దాన్ని ఆఖరిసారి విన్నాను...

One last time I heard the silence that resonates forever....

💔

మొండితనం అంటే


గొడ్డలి వేటును తట్టుకోలేదు ఏ మొండి చెట్టు, కానీ తిరిగి చిగురించగలదు, మొండితనం అంటే బలముతో కూడుకుంది కాదు, బలహీనతను ఒప్పుకొని ఓడిపోయి మళ్ళీ బలం పొందడము...

No matter how strong a stubborn tree seems, it can't survive an axe. But it can grow back. Being stubborn isn't just about strength; it's also about embracing weakness failing and growing again...

💜💜💜


సొగసైన బుగ్గ


మంచు నేలను కూడా గట్టిగా తాకలేని పూల అచ్చును చూసాను,
తన కమిలిన బుగ్గల లేత సొగసుపై పడ్డ పూల అచ్చును చూసాను,
ఆ పూరేకుల జాతకాన్ని తెలిపేంతగా పడ్డ పూల ఆచ్చును చూసాను,
నువ్వు అంత సొగసరివా లేక అది ఉక్కు చెట్టుకు పూచిన పువ్వా అని ప్రశ్న కలిగేంతగా పడ్డ పూల అచ్చును చూసాను ఆ బుగ్గల సొగసును తెలుసుకున్నాను..

I witnessed a flower print that couldn't even touch the frosty ground with its gentleness,
I beheld the floral pattern forming upon the pale beauty of her luscious cheeks,
I observed the flower print intricate enough to reveal the horoscope of those delicate petals,
I gazed at the flower print, pondering whether it's her tender beauty or the weighty flower from the steel tree that etched such an imprint...

💜💜💜

ఎత్తు లోతు


ఎక్కే ముందు కొండ ఎత్తును, దిగే ముందు నీ ప్రేమ లోతును,
దూరం నుంచే తెలుసుకోవాలి...

Understand the hill's height before ascending and grasp the depth of your love before falling in from afar...

💜💜💜

చిగురుటాకు మనసు


తొలకరి రుచి చూసిన చిగురుటాకు మనసేంటో నీ పలకరింపుతో అర్థం చేసుకున్నాను...

I understood the heart of the tender leaf that tasted the first dew through your greeting...

💜💜💜

ప్రేమే పాపమైతే


ఒకనాటి చిరుగాలి చెర గాలి అయితే,
ఒకనాటి ఎదురు చూపు ఇప్పుడు ఎదకు పోటు అయితే,
ప్రేమే పాపం అయితే,
పలకరింపు పిచ్చి మాట అయితే,
మౌనం సమ్మతం...

Once, a refreshing breeze; now, an oppressive bondage.
Once, hopeful expectations; now, waiting is a burden.
As greetings lose meaning,
And when love becomes sin,
silence becomes the sanctuary of emotions...

💔


తపన రాగం


తల్లడిల్లే చేపను వీణపై పడేస్తే ఆ తపనలోను రాగాలు పలికిస్తుంది,
తల్లడిల్లే నా మనసును నీ ప్రేమపై పడేస్తే ఆ కష్టంలోను నవ్వులు చిందిస్తుంది....

When a trapped fish is thrown onto Veena's strings, it creates fine tunes even amidst trouble.
When my suffering heart is thrown onto your love, it spreads a smile even in difficult times...

❤️‍🔥💜❤‍🔥

ఈత నేర్చిన ముత్యం


ఈత కొడుతూ ఒకరికై ఒడ్డు చేరుతుందా ముత్యం?
అవును అనే చెప్పాలి నాకు కలిగిన నీ పరిచయం..

Will the pearl swim to the shore to reach the one?
I must say yes after I met you...

💜💜💜

ఏమో


నీటిలో పడ్డ ఒక చినుకును వెతికి వెలికి తీయగలవా, అయితే తన ప్రేమను పొందగలవు...

If you can rescue the raindrop drowning in the water, then yes, you can gain her love...

💜💜💜

ఎడారి వలె ఎదురుచూపులు



నాలా విరహ వేదనతో ఆరాటపడుతున్న వాడి గుండెను ఎక్కడ దాచినా కష్టమని నీలో పాతి పెట్టారేమో, ఆ గుండె చప్పుడు నీలో ఇంకా సెగలు కక్కిస్తోంది, ఎండమావికై ఇంకా ఎదురు చూస్తోంది, ఓ ఎడారి నీతోడుగా నేను ఉన్నాను, గతించలేదు కానీ గతి తప్పుతున్నాను కనిపించినా కురవని తన మేఘాలు చూస్తూ....

Perhaps the heart of a person, once deadened by the agony of separation, is buried within you, as other earthly places cannot tolerate its vibrations. His heart's beat still makes you emit heat from within, and keeps you waiting for an oasis. Dear desert, you are not alone—I am also with you. Yet, I am alive, going out of my mind and experiencing an irregular heartbeat that none can understand, waiting for the clouds I see to shower...

❤️‍🔥💜❤️‍🔥

మెత్తని ముళ్ళ గడ్డి


దూరం నుంచి చూస్తే కొన్ని సార్లు మెత్తని గడ్డి కూడా కోరలు ఉన్న ముళ్ళులా కనిపిస్తుంది, కానీ చేరువయ్యే కొద్దీ అది మరే పానుపు ఇవ్వని హాయిని ఇస్తుంది..

Sometimes the far grass looks like sharp thorns, but if you still approach, it comforts you like nothing else can..

💜💜💜

ఊసులాడుతుంది


ఎక్కడో ఒక పువ్వు వాడిపోయుంటుంది,
ఎక్కడో ఒక మొగ్గ నలిగిపోయుంటుంది,
ఎక్కడో రెమ్మ చిగురు కుళ్ళిపోయుంటుంది,
కానీ తోట రంగులు అద్దుకొని,
సువాసనలు వెదజల్లుతూ,
ఆ గాయాలను లెక్క చేయకుండా చిరుగాలి వచ్చినపుడు 
నవ్వుతూ ఊగుతూ ఊసులాడుతుంది...

Somewhere, a dead flower,
Somewhere, a crushed bud,
Somewhere, a rotten stem,
But the garden, adorned with colors,
spreads scent,
smiles and whispers their joy when the breeze arrives...

💜💜💜

నీ బంధం


ప్రతి మాట గతి తప్పి నెల తప్పి నీ భావాన్ని పుట్టిస్తుంటే మైత్రినో మాయనో తెలియదు కానీ నీ పరిచయం ఒక పండుగే నీ తోడు నాకు వేడుకే, చేరువుగా ఉన్న వేల ఆకుల మర్రి చెట్టు నీడ కన్నా దూరంగా ఉండి నాపై వెలుగును చినుకును మంచును వసంతపు మాలికలను చల్లే నీ మేఘాల నీడలో ఉంటే చాలదా, పాత స్నేహాలు కొత్త స్నేహాలు అన్ని కలిపినా సరి తూగవు నీకు, చలువ చల్లే వెచ్చని దీపామా వెయ్యి వెన్నెలలు కలిసిన మనిహారమా, నీ మాటకు ఉప్పొంగి నాలో ఉబికే ఈ ఆత్మీయ లేఖ, నీ చెలిమి వ్రతాన్ని అందరూ చేయాలని అందరికీ అందాలని నా కోరిక...

I don't know whether every word that goes out of the way and delivers the feelings to you is an illusion or reality, but your acquaintance is like a festival to me. Even though you are far away like a cloud, your shadow shines on me like the sun, showering me with rain and snow, which is better than the thousands of shadows falling on me now. You are like a garland of spring flowers that adorns my neck. Whether it is old or new, no love can match yours. You are like a lamp that showers the snow and a necklace of a thousand moons. This heartfelt letter is my tribute to the love you have shown me. I wish everyone could celebrate your presence in their life and witness the loveliest being...

💜💜💜

ఊదా రంగు చినుకు




చినుకులలో ముత్యాలయ్యే చినుకులు కొన్ని,
నేలను చెమ్మ చేసి ముద్దాడే చినుకులు కొన్ని,
కానీ రంగు మారి నా దోసిళ్ళలో పడ్డ చినుకు నువ్వు,
 జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతంగా మిగిలావు...

A few pearly drops among thousands of raindrops,
A few drops that kiss the ground and keep it wet,
But you are a purple drop that fell into my hands directly, becoming a once-in-a-lifetime occurrence...

💜💜💜

నా చెలి పాదము


పారాణి పెడితే చాలు నిన్ను మారాణిలా మార్చే పాదము, గుచ్చుకున్న ముళ్ళనే కన్నీరు పెట్టించగల మృదువైన పాదము, ఏమి తోచనపుడు ఊగుతూ ఆడుతూ నీ ఆలోచనతో చెలిమి చేసే పాదము, నీ పాదరక్షలపై కట్టిన స్వర్గము నీ పాదము, నేను మట్టిలా నేలలా దాని కింద ఉండలేకున్నా అని బాద పెట్టే కఠినమైన పాదము...

A foot that, adorned with mehendi, can make you queen; a soft foot that can make it feel sorry and bring tears to a pierced thorn; a foot that playfully dances with your thoughts when you're idle; your foot is the heaven built on your sandals; a tough foot that makes me feel why I'm not beneath it like mud or the floor..

💜💜💜

పట్టులాంటి పాదం



ఈ ప్రపంచం పట్టు ఉనికిని కోల్పోతే, దాని స్థానంలో నిలబడగలిగేది నీ పాదాలు మట్టుకే..

When this world loses the presence of silk there is your feet which can stand it's place...

💜💜💜

చూపుల బాణం




ఏ యోధుడు పొందలేని ప్రయోగించలేని ఆయుధం నీ చూపుల బాణం..

The weapon no warrior possesses nor can use is your piercing stare..

💜💜💜

మబ్బుల దూదితో బట్టలు


నా హృదయానికి మబ్బుల దూదితో చేసిన బట్టలు తొడుగుతాను, అప్పుడే ఆవిరయ్యే నీ ప్రేమను పట్టుకొని బరువైనప్పుడు అక్కసు కాకుండా నాపై చల్లని మాటలు కురిపించాలని, కురిపించి తేలికై మళ్ళీ నీ ప్రేమను నింపుకోడానికి సిద్ధమవ్వాలని..

I adorn my heart with cotton from clouds, so it can hold your evaporating love and shower soothing words on myself when heavy, getting ready to be filled with your love again...

💜💜💜

ఎలాగ


మేఘాలపై గూడు కట్టి కదిలిపోకూడదు అంటే ఎలాగ,
పైగా గూడుకు రెక్కలు ఇచ్చి,
ఎగిరిపోకూడదు అంటే ఎలాగ..

It's unfair to be expected to stay once the nest is built on clouds, and even more so to expect the nest not to fly after giving it wings..

💜💔💜

ఎడారిలో వడగళ్ల వాన


ఎడారిలో వడగళ్ల వాన ఎంత కురిసినా అవి మంచు కొండలను కట్టలేవు..

No matter how many hailstones fall in the desert, they cannot build the mountains of snow..

💜💔💜

మంచు ముద్దలే విరహ వేదనే


వెలుగు పడని లోకంలో ఎక్కడ చూసినా మంచు ముద్దలే, నీ చూపు పడని నా మనసులో ఎక్కడ చూసినా విరహ వేదనే...

The place devoid of sunlight is filled with ice, and my heart, which you are not looking at, is filled with sorrow...

💜💔💜

పాదాలు పెట్టే ముద్దులు



అందరూ నేలపై అడుగులని అనుకుంటున్నారు కానీ ఆ తీరానికి కదా తెలుసు అవి నీ పాదాలు పెట్టే ముద్దులని...

All believe these are your footprints,
Yet only the shore knows: they are the tender kisses of your feet...

💜💜💜

అగ్గిపుల్ల సొగసు


ఓ అగ్గిపెట్టె,
నీలో ఒక్కో పుల్లకు ఎంత సొగసో,
రాసుకుంటే రాజుకుంటుంది,
తలతప్ప మరేమీ లేని పుల్లవి నువ్వే అంత వాడిగా ఉంటే,
తలతోపాటు రూపము ఉన్న నా చెలి సొగసును రాసుకుంటే నిదురలోని కలలు కూడా భగ్గుమంటాయి 
నిజములో ఉన్న నేనెంత, 
విర్రవీగకు 
క్షణములో చల్లారే నువ్వు 
ఆగక వెలిగే తన సొగసుకు సాటి కావు...

Dear Matchbox,
Each stick in you possesses beauty, 
lighting up when touched. 
Though you have only a head, your charm is undeniable. 
However, my lady's beauty surpasses even that of your captivating glow. 
A mere touch of her sets the dreams ablaze in slumber, and I can't stand her allure. 
Please don't deceive yourself; your beauty is fleeting, while hers is everlasting and incomparable.

💜💜💜

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔