వేడుకోదు


ఆరిపోయే చిరు దీపం నూనె కోసం వేడుకోదు, పోస్తే వెలుగుతుంది లేదా ఆరిపోతుంది, నీ ప్రేమ కోసం వేచి ఉంటా కానీ, అడగను ఆగడాలు చేయను....

A fading little lamp doesn't beg for oil; if you pour it, it will light up, or it will go out. I will wait for your love, but I won't ask for it, and I won't cause trouble....

🩵

కలకు వలకు



కలకు వలకు రుణపడి ఉంటా, ఎందుకంటే, కలలో నువ్వు నీ వలలో నేను...

🩵

నీ అందం విషం

కనులార్పడాన్ని ఆపేసే విషం, మది చప్పుడును పెంచేసే అమానుషం, స్పర్శకై చేతులకు దాహం పెంచే కర్కసత్వం, నీ అందం...

A poison that stops eyes from blinking,
A sting that makes the heart pound faster,
A curse that makes hands crave to touch always,
That's how your beauty is...

तेरी खूबसूरती एक ज़हर है जो पलकें झपकने से रोकती है,
एक चुभन है जो दिल को तेज़ धड़कने पर मजबूर करती है,
एक शाप है जो हाथों को हमेशा छूने के लिए तरसाता है।

🩵

కడ చూపు

కడ చూపులో ఎంత ఆశ ఉంటుందో అంత ఆశ ఉంది నీపై, నాలో మానిషి చావట్లేదు కానీ మనసు చస్తోంది...

There is hope on you as much as the hope in the dying eyes, the person within me is not dying but my heart is...

मरती हुई आँखों में जितनी उम्मीद होती है, उतनी ही उम्मीद तुम पर है, मुझमें का इंसान मर नहीं रहा है लेकिन मेरा दिल मर रहा है।

💔

ఊసులేక ఒంటరైన ఉప్పెన అని


వెతికి చూస్తే తెలిసింది అది మనోగతాల లోతులో చిన్న మనసని, ఊపిరి ఉన్నా ఊసులేక ఒంటరైన ఉప్పెన అని...

💔

నిజాల చీకటిలో పదాల వెన్నెల


కనులెంతగా వెతికాయో తెలియదు, మనసెంతగా తపించిందో తెలియదు, నిజాల చీకటిలో దాచాను పదాల వెన్నలను, తలెత్తి చూస్తే కనిపిస్తా, లేదా నా విరహాన్ని కురిపిస్తూ ఉండిపోతా

💔

కలగా ఉండిపో


ఒకటి మేలుకోలేని నిదురలో కలగా ఉండిపో లేదా మెలకువలో నా జ్ఞాపకాలని తుడిచిపో.....

Either remain a dream in eternal sleep or erase all my memories in wakefulness...

💜

పత్తి బంతి

పత్తి బంతి తగిలితే ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పనక్కరలేదు, ఎంత వేగంగా తగిలితే అంత మెత్తగా అనిపిస్తుంది,
చెలి నువ్వు మొండిగా మాట్లాడే ప్రతిసారి, నాపై ఉన్న ప్రేమ కనిపిస్తోంది..

No one needs to predict what happens if a cotton ball hits you hard,
The faster it is, the softer it feels,
My dear, every time you show your stubbornness, it feels that you care for me a lot...

किसी को ये अनुमान लगाने की ज़रूरत नहीं कि अगर रूई का गोला तुम्हें ज़ोर से मारा जाए तो क्या होगा,
जितना तेज़ होगा, उतना ही नरम महसूस होगा,
मेरे प्रिय, हर बार जब तुम अपनी ज़िद दिखाती हो, तो ऐसा लगता है कि तुम मेरी बहुत परवाह करती हो...

💜

చిట్టి బావ చిట్టి మరదలు


నీ వయసుకు నా వయసుకు ప్రేమంటే ఎక్కువ,
మరదలా! నా మనసుకు నీ మనసుకు మనమంటే మక్కువ, నీ అడుగుల ఆరాటం నా చూపుకు మొమాటం, 
మరదలా! నీ కథలో నేనంటే భూలోకమే ఓ స్వర్గం...

❤️

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared struggles. Together, we could create a masterpiece on the canvas of tomorrow.

Too short

What in this world is too short?
It is the time you share with me.
What in this world is too long?
It is the silence I imbibe when you don’t speak.........

😔

Makes me rich

I have 100 one rupee coins, there is a coin which makes me richer than you and makes me generous as well if you own that, which coin is that?

తానే రంగుల ప్రపంచం

ఈ ప్రపంచంలోని రంగులను చూడలేని వారికోసం: ఆమెను చూడండి. ఆమే ఒక రంగుల ప్రపంచం. ఆ రంగులను మీరు చూడగలిగితే, ఈ ప్రపంచాన్ని మరిచిపోతారు...

To anyone who cannot see the hues of this world: look at her. She is a world of hues herself. If you can see those colors, you will forget the rest of the world..

అడ్డుకట్ట

సముద్రపు అలలపై ఆనకట్ట నిర్మించడానికి ఎవ్వరూ సాహసించలేదు, వారి ప్రతాపమంతా నిర్మలంగా సాగే నదులమీదనే...

No one has ever dared to construct a dam to stop the flow of the ocean; all their expertise lies in building dams on rivers, which are calm and peaceful in comparison...

ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది


అందరూ మళ్ళీ వెళ్లి మట్టిలోనే కలిసినట్టు, నా మనసుకు ఊపిరి ఆగినప్పుడల్లా నీ జ్ఞాపకాలలో కలిసిపోతూ ఉంటుంది, అందులోనే మళ్ళీ జన్మ పోసుకొని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది...

Like all souls return to dust, my heart, when it ceases to beat, dissolves into memories of you. There, I am reborn, hopeful and waiting...

🩵

నేను

ఎలా గాలి తాకినా కదిలే చిగురుటాకు కాను నేను, ఒక దిశలో తాకితే తప్ప పలకని వేణువు నేను, ఒక దిశలో తాకితే తప్ప పలకని మొండి వేణువు కాను నేను, ఏ దిశలో తాకినా సంతోషంగా పలికే లేత చిగురుటాకును...

I am not a tender leaf  
That sways with the wind,  
Touching in any direction.  
I am the flute  
That responds only when  
The air flows just right.  
I am not as stubborn as the flute  
That waits for the perfect breath.  
I am like the tender leaf  
That dances joyfully  
With the touch of air in any direction...

తేనెపట్టు


ఏ జాతి తేనెటీగకి ఇంత నేర్పు ఉందో తెలియట్లేదు,
తేనెపట్టు చెట్టుకే కాదు కడుపులోనూ ఉంటుందని నిన్ను చేతికి తీసుకున్నాక తెలిసింది,
సమయం గడిచేకొద్దీ ఈ తేనెపట్టు నవ్వుల తేనెలూరిస్తూ మరింత పెరుగుతోంది...

I wonder what kind of bee could be so skilled,
To build a honeycomb, not in a tree, but within one's belly.
I only realized this when I held you in my hand.
As time passes, this honeycomb fills with honeyed laughter, growing ever larger...

❤️

గాలిపటం




గాలిపటం గాలికి తట్టుకోలేకపోతే,
బలమైన గాలిపటాన్ని తయారు చేయాలి,
అంతే కానీ గాలిని నిందిస్తే,
ఎప్పటికీ గాలిపటం ఎగురవేయలేరు...

ಗಾಳಿಪಟವು ಗಾಳಿಯನ್ನು ತಡೆದುಕೊಳ್ಳಲಾಗದಿದ್ದರೆ,
ಬಲವಾದ ಗಾಳಿಪಟವನ್ನು ಮಾಡಬೇಕು.
ಗಾಳಿಯನ್ನು ದೂಷಿಸುವವರು
ಯಾವಾಗಲೂ ಗಾಳಿಪಟ ಹಾರಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ....

If the kite cannot withstand the wind,
The flyer must make a stronger kite.
Those who blame the wind
Cannot fly the kite forever...

💡

చులకన

ఎగిరే గాలిపటానికి చులకన అయ్యాను నేను కింద ఉన్నందుకు, తనను ఎగురవేసింది నేనే అని మరచి, నింగితో సావాసం చేసింది తారకై అక్కడే ఉండిపోయింది....

I was disregarded by the soaring kite because I was on the ground while it was flying high, forgetting that it was I who made it fly. It mingled with the sky and stayed there, turning into a star..

उड़ते हुए पतंग ने मुझे नज़रअंदाज़ कर दिया क्योंकि मैं जमीन पर था जबकि वह ऊंची उड़ रही थी, यह भूल गया कि मैंने ही इसे उड़ाया था। यह आसमान में मिल गया और वहीं रह गया, एक तारे में बदल गया।

🩵

చిరుపాదం



మురిపాల జలపాతమా,
మురిసింది ఈ నేలమ్మ,
చిరునవ్వు చిరు పాదమా,
నువ్వు కదిలొస్తే నది కృష్ణమ్మ...

❤️

బంగారం రాయి

బంగారాన్ని రాయికి రుద్దితే రాయి మెరుస్తుంది కానీ బంగారంగా మారదు..

Rubbing the gold on the stone makes it shine like gold, but it cannot turn the stone into gold..

💡

దుఃఖంతో చేసిన మనసు

దుఃఖంతో నిండిన మనసును ఓదార్చగలము,
కానీ దుఃఖంతో చేసిన మనసును ఆదరించగలమే కానీ ఆర్చలేము...

💡

నమ్మరా

దీపం లేకనే వెలుగు చూసాను అంటే నమ్మరా, తన రూపం చూడకనే తలపులతో జీవిస్తున్నా, గాలి లేకనే శ్వాస తీసుకుంటున్నా అంటే నమ్మరా, తన మాట లేకున్నా  పలుకుల తాకిడి నాకు వినిపిస్తోందిగా...

వేడుకోదు

ఆరిపోయే చిరు దీపం నూనె కోసం వేడుకోదు, పోస్తే వెలుగుతుంది లేదా ఆరిపోతుంది, నీ ప్రేమ కోసం వేచి ఉంటా కానీ, అడగను ఆగడాలు చేయను.... A fading litt...