నీలో నిజమై నేనున్నా చూడు , కలలో నీతో కలిసున్నా చూడు , కదిలే కడలి నీ తీరం ఏది, కరిగే మనసా నీ గమ్యం ఏది , కనులార్పకింక రెప్ప పాపను వీడిపోయింది, మదిలోని ఆశ ప్రాణమై నన్ను మేలుకొలిపింది .... చూసేలోగా దూరమయ్యావు నువ్వు , చేరేలోగా మరో చెయ్యి పట్టావు నువ్వు , ఆశకింక అంతమంటు మౌనంతో చెప్పావు , ఆగలేని అడుగును ఎందుకు ఆపలేదు , నాలో నిండిన నిన్ను ఎందుకు అడగలేదు , తీసుకో నీ మనసును వేసిపో ఒక హద్దును .... నీ స్పర్శనే అడిగి ఉండనే అది జ్ఞాపకం అవుతుందని తెలిసుంటే , నీ కళ్ళనే చూసుండనే దాని కలకే నేను పరిమితం అవుతా అని తెలిసుంటే , ప్రేమ అన్న వలయంలో చిక్కుకోలేదు కాని నీవు అన్న నిజంతో బ్రతికాను, దూరం అన్న శత్రువుకి బయపడలేదు కాని అది తగ్గదని తెలిసాక బ్రతకలేకున్నా , ఓటమి ఇచ్చుంటే గెలుపు వైపు పయనం చేసుంటాను , గెలుపు ఇచ్చుంటే శిఖరాలకు చేరుంటాను , ఒడిదుడుకులు ఓటమి అంచులు చిరునవ్వులు గెలుపులు అన్ని నీవైపోయవే , మారో దారి ఏదని తెలియకుండా ఉన్నా , మరో ప్రపంచమే నాకు తగినదని దూరామౌతున్నా ..... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
నీలో నిజమై నేనున్నా చూడు
ప్రేమ సంతకం
Subscribe to:
Posts (Atom)
तुम हर जगह हो
तुम हर जगह हो… मुझे तुम्हारे बारे में सोचने से रोकना है, तो पहले चारों दिशाओं को बंद करना होगा, हवाओं से कहना होगा कि वे चलना छोड़ दें, सुबह...

