కలగవా కన్నీరు కడలికైనా











కలిగిన ఆశలు ప్రేమకు లోకువైతే ,

విరగదా మనసు ఎంతటి కొండధైనా ,

కలగవా కన్నీరు కడలికైనా .......


మోహం











కనులెదుటే మోహం ఉన్నా ,

తెలియదు ఎందుకో పిచ్చి మనసుకు ,

లోకమంత ప్రేమ ఉన్నా సూన్యమౌతుంది దాని ముందు,

తెర దించాలన్నా కాదేందుకో మోసపోతుంది ,

అది ప్రేమే అన్న బ్రమలో ఉండిపోతుంది ,

వీడాలని మనసంటున్నా ఆలోచన దానిని వెక్కిరిస్తుంది ,

జయించగలిగితే ప్రేమను పొందగలవు ,

ఓడిపోతే ఒంటరివౌతావు .......


విధికే అంకితం నా దు:ఖం












నిదురలో నిలువకే ,

నిజములా వాలవే ,

కనులతో ఆడకే ,

కన్నీటిని తెప్పించకే ,

మనసా నీవొక మాయేకదా ,

మంత్రమేసి చూపించు నా చెలిని ,

వయసా నీవు ఆగలేవు గా ,

వేగంగా వెళ్లి చేరుకో నా సఖిని ,

ఎందుకిలా చేస్తావో తెలియదు ,

ప్రేమగా ఎందుకు మారుతావో తెలియదు ,

మారినా మాసిపోవెందుకు ,

ప్రాణం పోయినా ప్రణయ రాగం ఆపవెందుకు ,

విధికే అంకితం నా దు:ఖం ,

ను విని నను చేరితే నాకు మరో ప్రాణం అందిస్తావు ,

లేకుంటే మరు జన్మలోనైనా నను వదలకు ......


నీడనే ముద్దు కోరితే

నీ నీడనే నీకు ముద్దు పెట్టేంతగా ముద్దొస్తున్నావు, చెలి నీ అందాన్ని నేను ఏమని వర్ణించను... आप इतनी प्यारी हैं कि आपकी परछाई भी आपको चूमना चाह...