మూఢనమ్మకం

పద్ధతులను ప్రశ్నించేవాడు తార్కికవాదే అయితే  దానిని వివరించలేని వారు పలాయనవాదులే,
స్పష్టత లేని ఏ నమ్మకం అయినా మూఢనమ్మకమే...

కలనా జ్ఞాపకమా

నీ కల కలిగే తరుణంలో నీ జ్ఞాపకం అడ్డొస్తే ఎలా?

ఎంత ప్రేమ

పదే పదే ప్రేమ పొందినా ఇంకా ఎంత ప్రేమ ఉందనే ప్రశ్నలే నా ఎదురు చూపులు నువ్వు పంపే చిరు కానుకాలే వాటికి సమాధానాలు...

బంధం

కొన్ని బంధాలను మనసు ఒప్పుకుంటుంది,
కానీ మనుషులు ఒప్పుకోరు,
కొన్ని బంధాలకు పేర్లు అక్కర్లేదు,
కానీ పేరు లేనిదే సమాజం ఒప్పుకోదు,
కొన్నిటికి కారణం ఉండదు,
కానీ ఆధారం కావాలంటారు,
కొందరి ఆదరణ కావాలనిపిస్తుంది,
కానీ ఆ ఆవేదనకు ఆమోదం ఉండదు,
ఇలా నలిపివేసిన ప్రతి సారి వాడిపోయినా,
పువ్వులా వెదజల్లుతాయి సువాసనలను...

ఆ సంతోషానికి పేరేంటి

ఏ చినుకు వాలని ఎదపై ఒక్క చినుకు జారకుండా నిలిచిపోతే ఆ సంతోషానికి పేరేంటి?

వాడినా సరే విడిపోయి నిన్ను వెతుకుతున్నాయి

పూలపై నీ బొమ్మ గీస్తుంటే, కొమ్మనుంచి రాలిపోతున్నాయి, వాటికంటే కొమలత్వమా అని ఆశ్చర్యపోయి, వాడిపోయినా సరే కొమ్మను విడిపోయి నిన్ను వెతుకుతున్నా...