మొలక రాకుంటే ఓటమి కాదు/It is not lost if it didn't sprout

మొలక రాకుంటే ఓటమి కాదు....
అనుభవాల వేర్లు ఎంత లోతో ఎవరికి తెలుసు....
-----------------------------------------
It is not lost if it didn't sprout...
Who knows how much depth it's roots are in...

గూటి నిండా గువ్వ నిండినట్టు / Like The Dove Filled The Nest

గూటి నిండా గువ్వ నిండినట్టు మనసు నిండా నువ్వు నిండిపోయావు...
----------------------------------
You filled my heart like the dove filled the nest...

జ్ఞాపకాలకు తొలి పొద్దు నీ జ్ఞాపకం / You're The Sunrise To My Thoughts

జ్ఞాపకాలకు తొలి పొద్దు నీ జ్ఞాపకం..
కలలకు పౌర్ణమి నీ స్వప్నం...
------------------------------
You're The Sunrise To My Thoughts...
Dream about you is the full moon day for my dreams...

గుచ్చి పెట్టలేవు ప్రేమను/ You Cannot Hook The Love

గుచ్చి పెట్టలేవు నువ్వు చేసిన నక్షత్రాన్ని ఆకాశంలో,
గుచ్చి పెట్టలేవు నువ్వు చేసిన చినుకును మేఘంలో,
గుచ్చి పెట్టలేవు నువ్వు చేసిన ప్రేమను మనసులో,
తానుగా కలిగితేనే నక్షత్రమైనా,
తానుగా కలిగితేనే చినుకైనా,
తానుగా కలిగితేనే ప్రేమైనా ఏదైనా....

You cannot attach the star you created to the sky,
You cannot attach the drop you created to the clouds,
You cannot attach the love you created in someone's heart.
A star must form by itself,
A drop must form by itself,
Love, or anything else for that matter, must form by itself.


బలం ఎక్కడిదో? / Strength Of Love

కెరటానికి బలం ఎక్కడిదో...
మనసుకు ప్రేమ ఎక్కడిదో...
ఏది ఎగసిపడినా ఆపగలిగేదెవ్వరో...
--------------------------------------------
From where the tide got strength,
From where the heart got love,
Who can stop,
If any of them overflows..

మైమరపు

ఎదో ఒకటి అందంగా ఉంటే వర్ణించొచ్చు...
ఎన్నో అందంగా ఉంటే ఆస్వాదించొచ్చు...
ప్రతిదీ అందమే అయితే మైమరచిపోవచ్చు...
మరి నిన్ను చూసి మైమరచిపోతున్నా...
---------------------------------------------------------
If something is beautiful, describe...
If few things are beautiful, enjoy...
If everything is beautiful, sink into it...
I am just sinking by looking at you...

చామంతి ఛాయాలో సిరిమల్లె

చామంతి ఛాయలో సిరిమల్లె,
సిరిమల్లె పెదవిలో మందారం,
మందార మకరందానికి తేనెటీగ ఝంకారం...

నీ కథ నా కథ తెలుసుకునేదెలా?

నీ కథ నా కథ తెలుసుకునేదెలా...
మనసును మాట్లాడనిస్తే అదే తెలుపదా...
మనసు మాట వినిపించదే మరి వినేదెలా...
నువ్వు నేను హత్తుకుంటే వినిపించదా...
------------------------------------------------------------
How to know yours and my story?
We can if we let our hearts speak...
But we cannot listen to our own hearts!
Won't a hug help us to listen to each other?

ఉప్పు తప్పు

ఎంత ఉప్పు చేతికి ఇచ్చావో ఓ సముద్రుడా...
నీతో వైరం ఎప్పుడు రాలేదు...
పైగా నీ అవసరం రోజు పెరుగుతూనే ఉంది...
మరి అదే ఉప్పు చేతికందిస్తే తప్పేమిటి అందులో గుట్టేమిటి...?

ముళ్ళ కాపు కట్టావు మనసనే ఊరికి,

ముళ్ళ కాపు కట్టావు మనసనే ఊరికి,
ప్రేమ దాటి పోకుండా చూసుకోగలవా,
ప్రేమ చూపాలని అదిమిపెట్టి ఉంచావు,
ఆ బరువుకు దానికి ఊపిరాడగలదా, వీడిపోతానన్నా ఎందుకింకా ఆరాటం,
వధనుకున్నా ఎందుకింకా పోరాటం,
పూతోట దాటిన పువ్వు మళ్ళీ ఆ తోటను చేరగలదా,
వెర్రి మనసా వేగమెక్కువా వయసు దాటి ఆలోచించు,
ఏమి తోచకుంటే అడుగువేసి ప్రేమను సాధించు,
ఏదీ చేయక ఆగిపోతే నీ నీడకు తోడు దొరకదు,
నీ ఆరాటానికి అర్థం ఉండదు...

ప్రేమజువ్వలు

మందు రాజుకుంటే తారాజువ్వలు,
మది రాజుకుంటే ప్రేమజువ్వలు,
వెలిగి వెలిగి ఆగిపోయినా,
మళ్ళీ వెలగకపోయినా,
ఆ వెలుగు చూసిన కనులు,
ఆ ప్రకాశాన్ని మరచిపోలేవు...

చినుకమ్మ పాట

చిగురాకు నీడలో, 
చినుకమ్మ పాట,
చిరు జల్లుగా మారి,
చిన్న మాయ చేసే...

నీ జత లేని జీవితము

చినుకుతో జత కట్టలేని మయూరము,
వసంతంతో జత కట్టలేని కోకిల రాగము,
నీతో జత కట్టలేని ఈ జీవితము...

కరుణ లేని కురులు

నీ కురులు కరుణ లేనిది,
అవి స్వేచ్ఛగా ఉంటూ,
నన్ను కట్టిపడేశాయి..

హాయిగా గడపాలంటే

మిగిలిన కొంత కాలం హాయిగా గడపాలంటే...
రగిలినవెన్నో ఆరిపోవాలి...
పగిలినవెన్నో ఒక్కటవ్వాలి...
జరిగినవెన్నో మరచిపోవాలి...

మనసు కథ మనసులోలోనే కదా

ఎంత బరువు పెట్టినా పెట్టినట్టు ఉండదు..
ఎంత తట్టుకున్నా బరువు మోసినట్టు ఉండదు..
మనసు కథ మనసులోలోనే కదా..

అందానికి చిరునామా

ఘడియ ఘడియకు అందాలు జన్మించినా ఎన్ని యుగాలు కావాలో నీ అందం అందుకోడానికి...
ఓ ప్రియతమా అందానికి ఒకే ఒక్క చిరునామా ఉంటుంది అది నీలొనే దాగి ఉంది...

దీపావళి

నీలో పగిలిన జ్ఞాపకాలే కమ్మే చీకటి మేఘాలు..
నీలో కలిగే ఆనందాలే తారాజువ్వలు..
నిత్యం వెలగనివ్వు చీకటిని తొలచనివ్వు..

అసలైన చీకటి ఏదో?

నీ కురులకు మల్లెలు తోడైతే ఏది అసలైన చీకటో ఏవి నిజమైన తారలో పోల్చడం కష్టమేమో...

మేఘాలలో జ్ఞాపకం

మేఘాలలో జ్ఞాపకం చినుకాయనే, 
చల్లగా తడిపేసి తడిమేసి నను వీడి వెళ్లిపోయేనే...

తిరిగొచ్చినా మేఘము వేడెక్కేనే, జ్ఞాపకం అల్లాడి తల్లాడి కన్నీరు వదిలిపోయేనే...

నా గుండె పంట పండగలేక,
నా కంటిపాప ఏడవలేక,
నాలుగు దిక్కులు చాలక పైకి,
ఎన్నెన్నో రంగులు నలుపాయే చూపుకి,
ఓడిపోయేనా గుండెచప్పుడు,
వేగమెందుకో లేదు ఇప్పుడు,
ప్రాణం అయ్యో పాపమన్నది,
ప్రాయం పాటకు ఆడకున్నది,
విధిలేక బ్రతుకు నిలవలేక సమయం, రెండు  సాగుతున్నది....

నిన్ను నువ్వే అనుమతించుకో

నువ్వు అనుకున్నది చేయడానికి నీ ఆలోచన నిన్ను అనుమతించాలి కానీ మారేది కాదు..

పరదా దాటి నా చూపు నీ కోసం

మేఘం పరదా వేసినా జాబిలి కనిపించకుండా ఉండదు, 
రోజు ఆ వెన్నెలలో తడిసే మనసు మేఘాలను దాటి దానిని చూడక మానదు...

కొలవలేనిది? 😉

జుట్టు పెరగడాన్ని,
ప్రేమ పెరగడాన్ని,
ఎవ్వరు కొలవలేరు...

నింగి హంగులన్నింటికీ నీవు ప్రతిబింభమే

చినుకు వాలి తడిపితే చక్కని సొగసు, 
రంగు వాలి నిను తడిపితే ఇంద్ర ధనస్సు, 
ఏది నిన్ను తాకినా అందమే, 
ఆ నింగి హంగులన్నింటికీ నీవు ప్రతిబింభమే...

కదలిక లేదు

జాబిలికి కబురు పంపినా, 
వేకువకు లేఖ రాసిన,
సంధ్య వేళ రెండు ఉత్తరాలకు,
జాబు లేదు జవాబు లేదు,
ఎరుపు కమ్మిన నీ అందం చూస్తూ వాటికి కదలిక లేదు...

నీకెందుకు ఆ పట్టుదల?

ఓ నీటి బుడగా! నీకెందుకు ఆ పట్టుదల?!
చిన్న అలికిడికే పగిలిపోతావు,
అంత దూరం ఎగరలేవు,
గాలి ఉన్న ఆశతో బ్రతుకుతుంటావు,
ఎవరి ఆనందానికి బలి అవుతావో తెలియక,
నీ దారి నీ చేతిలో లేక,
బ్రతికే నీ కొద్దిపాటి జీవితంలో
ఏం సాధించాలని నీకు ఆ పట్టుదల??!

నువున్నావాని తెలిసి

నిధిలా దొరికావు,
నిజమై నిలిచావు,
కథనే రాశావు,
కనుమరుగయ్యావు,
స్నేహమా ఎవ్వరు లేని నిశబ్దాన్ని భరించగలనేమో కానీ,
నువున్నావాని తెలిసి నీ అలికిడి లేని నిశబ్దాన్ని భరించలేను..

చీకటి వెనుక దాగలేవు

ఓ జాబిలి చీకటి వెనుక దాగున్నావాని బ్రమ పడకే నీ వెన్నలను ఏ చీకటి ఆపలేదు నీ అందాన్ని ఆకాశము దాచలేదు..
ఆడదానికి ఆభరణం దాచుకోడానికి కాదు అలాగే చీకటి నిన్ను దాచాలనుకోదు...

ఓటమిని గెలుపుని మరొకరి చేతిలో పెట్టకు

ఓడినపుడు
ఆశపడే స్థాయి లేదనుకోకు..
గెలిచినపుడు సాధించాననుకోకు..
నీ ఓటమిని గెలుపుని మరొకరి చేతిలో పెట్టకు..
సాధన చేయాలి పోటీ పడాలి ఆటను ఆస్వాదించాలి ఫలితాన్ని ఆహ్వానించాలి..

ముక్కలైన మనసు

పగిలిన అద్దంలో ప్రతి ముక్క మరో అద్దం ఔతుంది..
అలాగే ముక్కలైన మనసు వాలే ప్రతి చోట కొత్త ప్రేమ చిగురించాలి మరింత ప్రేమను అందుకోవాలి..

కవిత్వం అనంతం

అది తరంగాలు చేరుకునే తీరం, మనోభావాల చిన్న కుటీరం, 
ప్రేమను ద్వేషాన్ని సమంగా చూపే అద్దం, 
కవికి మరో లోకం, 
అదే కవిత్వం అది అనంతం..

చెలిమి చంద్రమా

వెతికి వెతికి అందాన్ని కూర్చి నిన్ను చేసాడు..
నీ అందాన్ని వర్ణించే మనసు నాకిచ్చాడు..
చెలిమి చంద్రమా నీ వెన్నెల ఇంత అందమా..

ప్రేమ సంతకం

గతములో కలిగినా సరి కొత్త జ్ఞాపకం..
మనసులో దాగినా కనుల ముందే నీ రూపం..
కలవరింతకు తొలి వరం..
కౌగిలింతకు తొలి స్వప్నం..
ఏకాంతానికి తొలి నేస్తం..
నీ చెలిమి చేసిన ప్రేమ సంతకం..

కలిగిన ప్రేమ కరిగిపోయింది

మంచు శిల్పాన్ని దాచుకునేంత చల్లని మనసు కాదేమో!
అందుకే కలిగిన ప్రేమ కరిగిపోయింది,
కలలు కన్న కనులు నిన్ను ఆరాదించలేదేమో!
అందుకే చూడలేనంత దూరం వెళ్ళిపోయింది,
నీ ప్రేమ నాతోనే ఉండాలని కోరుకోలేదేమో!
అందుకే స్వేచ్ఛతో వదిలిపోయింది..

నిర్జీవమైనా నీకోసం వేచివున్నా

నిన్ను చూడగానే ఆగిపోయే వేగం గుండెలో..
మనసాగగానే వాలిపోయా నీ ప్రేమలో..
నా ప్రాణం నీలో కలిసిపోయాక ఇక నేనెందుకు..
అయినా నాలో నీ ప్రేమ నింపుతావనే ఈ ఎదురుచూపు..

ఆటకు పాట ఆడాల్సిందే

నీతో నువ్వు జత కడితే నీ ఆటకు పాట ఆడాల్సిందే...

ప్రేమించకు తారకను

ఎవరిపైనైనా మనసు పారేసుకోవచ్చు కానీ తారక మీద కాదు ఎందుకంటే ప్రతి రోజు వస్తుంది ఉన్న చోట ఉంటుంది కానీ కనులకు తెలియదు తానేనని చెప్పుకోదు అన్నిటిని మెరిపిస్తూ మోసం చేస్తుంది ఏ తారక తానో చెప్పక ఆటపట్టిస్తుంది...

వెలుగు వెదజల్లు

వేల దీపాలు ఉన్నా కాంతులు వెదజల్లే ఒక్క కాకరపూవొత్తి కంటికి ఇంపు..

మనసు ఎవరికి తెలుసు

మనసు తెలుసుకున్న వాళ్ళకి,
దాని ఇష్టాలతో పని లేదు,
అందులో ప్రేమ చూసిన వారికి,
 దాని కష్టాలతో పని లేదు...
💔

ఎంతో దూరం

లోపలికి బైటకి ఏంతో దూరం ఉంది కనుకే,
 స్పందించే హృదయపు ఆవేదన వినిపించదు,
లోలోనే పగిలి మిగిలిపోయిన గాయాల గుర్తులు కనిపించవు,
నిస్సహాయంగా మిగిలిన ఒంటరితనము బయటపడదు,
ఎంత చెప్పినా ఆ కష్టం తీరిపోదు...
💔

స్నేహం ప్రేమ

ప్రేమను దాచి స్వేచ్ఛను ఇచ్చేది స్నేహం, 
స్నేహంగా జత కోరి తోడుగా మారేది ప్రేమ...

ఎవరిష్టం?

రేవులోని పడవనడుగు ఎవరు ఇష్టమని..
ఆడించే అలనా లేక చోటిచ్చే రేవా అని..
కాదు నను చేసిన వాడని అంటుంది..

నీ స్నేహం

అప్పుడెప్పుడో నేర్చుకున్న అక్షరాలు నీ సావసంతో మరింత కమ్మగా పలుకుతున్నాయి..
అందుకే నీ స్నేహాన్ని వాటితోటే పొలుస్తున్నా..
నిన్ను వాటిలోనే దాచుకుంటున్నా..

చిల్ డ్యూడ్

చిల్ డ్యూడ్,
నీతో నేనున్నా,
కూల్ డ్యూడ్,
నీతో నేనొస్తా,
కలిసే ఎగురుదాం,
కలిసే పరుగెడతాం,
నీ గమ్యం నా గమ్యం వేరైనా,
ఒకరికి ఒకరై సాగుదాం,
ఇదే మన లోకం,
మనది మరో ప్రపంచం..

మనసును వాడేసుకోకు,
వయసును పారేసుకోకు,
వాచ్ చేస్తుందిలే టైంపాస్ నీకోసం,
ను పాస్ చేయకు ప్రతి అవకాశం,
బ్రోకెన్ హార్ట్ ని ఫిక్స్ చేస్కో,
బ్రోకెన్ వీట్ తో లంచ్ చేస్కో,
హెల్త్ అండ్ వెల్త్ నీదేలే,
నలుగురికి ను ఉండాల్లే..

ఓడిపోతే వోడ్కా,
బోల్తాకొడితే కొడితే బీరు,
దిగులుకు ఎందుకు మందు,
చుట్టే భూమిని చూడాలంటే,
గో ఔట్ అండ్ సీ ద వరల్డ్,
మత్తులో తూలి లేవాలంటే,
అచీవ్ వాట్ యు వాంట్,
కిక్కు ఉంది జిందగిలో,
నీ గెలుపును నువ్వు మిక్స్ చెసుకో..

పదమును నేర్చుకుంటుంది ఈ చల్లని రేయి

నిదురలో కాదు నిదురకు రావే నిచ్చెలి,
కలలు కూడా నిన్ను ఇలలో కోరుకుంటున్నవి నా చెలి,
నా నీడకు చీకటిలో నీ వెలుగు కావాలి,
అప్పుడే కనిపిస్తుంది,
 లేదంటే నిను వెతుకుతూ నను వదిలిపోతోంది,
ఒకే ఒక్క అక్షరం నా ఒంటరితనం,
జత చేరి నన్ను పదమును చేయు,
ఆ పదమును నేర్చుకుంటుంది ఈ చల్లని రేయి..

ఆదరణకు వీడుకోలు

చిన్న మాటకు సమయం లేదు...
చిన్న పలకరింపుకు తీరిక లేదు...
అనుబంధాలకు అడ్డుగోడలు...
ఆదరణకు వీడుకోలు...

వెన్నపూసవా

యెవ్వనాల పాల నుంచి తీసిన వెన్నపూసవా..
వేకువంత వదిలిపోయిన వెచ్చని వెన్నెల సొగసువా..

ఒకటి అందంగా అయినా ఉంటావు లేక ముద్దుగైనా ఉంటావు

ఒకటి అందంగా అయినా ఉంటావు లేక ముద్దుగైనా ఉంటావు

ఎలా వచ్చినా చేరేది మనసులోకే

కనుల నుంచి మనసు చేరే ప్రేమలు...
మాట నుంచి మనసు చేరే ప్రేమలు...
స్పర్శ నుంచి మనసు చేరే ప్రేమలు...
ఎలా వచ్చినా చేరేది మనసులోకే...
మనసు చేరితే కలిగేది ప్రేమ మట్టుకే...

ఆలోచనకు మెరుపొస్తుంది

ఎన్నో ఘర్షణలకు లోనైతేనే ఆలోచనకు మెరుపొస్తుంది..
ఓడిన చోటే అనుభవాలు ఓనమాలుగా కొత్త పాఠాలు నేర్పుతాయి..

అప్పుడు ఇప్పుడు

తొందరగా చీకటి పడితే జాబిలిని చూడచ్చని ఎదురుచూసే కనులు అప్పుడు...
కానీ ఇప్పుడు చిరు నేస్తాల పలకరింపుకై ఎదురుచూస్తోంది...❤

నీ కనులు వాలితే అందమొస్తోంది

సందేహిస్తోంది నా ఆలోచన అంత అందాన్ని ఎలా పోల్చాలని దేనితో పోల్చాలని..
కనులు వాలితే కలలొస్తాయేమో కానీ నీ కనులు వాలితే అందమొస్తోంది..
ఒడిపోతున్నా ఒప్పుకుంటున్నా నీ అందాన్ని పోల్చడం నా తరం కాదని కాదు కాదు ఎంత పోల్చినా తక్కువేనని...

మన కష్టం చిన్నది

మన కష్టం వాళ్ళ కష్టం కంటే చాలా చిన్నది..
మనకు నచ్చినవారు లేకపోవచ్చు వాళ్లకు బ్రతకడమే కష్టమౌతోంది...

మేఘమా కనికరించు

నింగిలో నిలువలేనంతగా అందంగా ఉందా ఈ భువి..
ఆగకుండా కురుస్తున్నావే..
ఓ మేఘమా కనికరించు నెమ్మదించు..
నీ ప్రేమ వేగం తగ్గించి చిరుగాలిలా మారు ..
 మా చిన్న బ్రతుకులపై దయతలచు..
🙏

గెలుపంటే?

ఎందుకు అని ప్రశ్నించకు..
ఎప్పుడు అని ఎదురు చూడకు..
అడుగువేసే ధైర్యం లేకుంటే..
గెలుపు మీద మక్కువ పెంచుకోకు..
👎
గమ్యాన్ని అందాలనే తపనలో మనసు ఉడుకుతుంటే ఆ వేడి సెగలకు నువ్వు అందుకునే వేగం లో ఉంది నీ గెలుపు..
అంతేకాని అందుతుందో అందదో తెలియని గమ్యం లో కాదు..
👍

వచ్చి పోయే మేఘాలు

వచ్చి పోయే మేఘాలలో పులకరింతలు ఉంటాయేమో కానీ పలకరింపులు ఉండవు...
కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే మేఘాలలో పులకరింతలు పలకరింపులు ఎదురుచూపులు అన్ని ఉంటాయి...
💭

నిన్ను నీకే అర్పించుకో

పగిలే హృదయమా పారిపోకు..
చిగురు తొడిగే వసంతాలు రాకపోవు..
రగిలే తాపమా తరలిపోకు..
నీ ఆలాపనలో బాధ కూడా సుఖమని మరచిపోకు..
నీలో నీకై నీలో నీవై నీకే నీవై
నిన్ను నిన్నుగా ప్రేమించుకో..
నిన్ను నీకే అర్పించుకో..!
💔

అందదు తళుకుమనదు

చేరువనున్నా జాబిలి తళుకుమనదు..
తళుకులున్నా తారక చేతికందదు..
💔

సాధనను అలవాటుగా చేసుకో

నువ్వు వ్యర్థం కావు..
నీ ఆలోచన వ్యర్థం కాదు..
సంకోచించకు సందేహించకు..
ఆచరణలో పెట్టు..
ఆగకు అన్వేషించడం ఆపకు..
ఫలితం నీది కాదు ఎదురు చూడకు..
సాగిపో సాధనను అలవాటుగా చేసుకో..

కఠినమైనది

కఠినమైనది జ్ఞాపకం...
కరుణలేనిది ఈ దూరం...
కలతకు కానుక కన్నీళ్లు...
గడిచిపోయినా ఇంకా ఎన్నాళ్ళు...
💔

చీకటిని అంతా నా కౌగిట నింపు

వెన్నలను కోవెలగా చేసినావా, 
కోవెలలో తనను తారకను చేసినావా, 
అయినా దూరం కదా, 
మనసుకు భారమౌతోంది, 
అందాన్ని చూస్తూ కనులు చిన్నబోతోంది, 
నేలకు పంపు నింగిని దించు,
చీకటిని అంతా నా కౌగిట నింపు...

విరహాన్ని అలవరచుకో

నిరాశ చెందకు మనసా... 
శ్వాసలో నీ ప్రేమని ఉంచావు....
ధ్యాసలో ఆమెను ఉంచావు...
విరహాన్ని అలవరచుకో...
సంతోషంగా ఉండగలవు...

స్నేహం

చిలిపి వయసులో మనసే తడబడి..
అదుపు తప్పి మళ్ళీ నిలబడి..
తోడు కోసం ఎదురు చూస్తే..
ఆ ఆశ పేరే స్నేహం..

స్నేహం

ఊహకు నిలువుటద్దం..
ప్రేమకు చెలిమి రూపం..
నీ జ్ఞాపకం ఇక్కడ..
నీ స్నేహం ఇక్కడ ❤

స్నేహోదయం

ప్రతి రోజు వెలికితీసే జ్ఞాపకాలలో,
ప్రతి కిరణం గుర్తు చేసే ఉదయంలో,
చిగురించే చిరు కవితలు మీరు,
అల్లుకుంటూ హత్తుకుపోయే చెలిమి మాలికలు మీరు.... 

నవనూతనం

నవనూతనం నిత్యం సంతోషం మీ చెలిమితో మీ కలిమితో...  

చీకటికి కాటుక వెన్నెల

చీకటికి కాటుక వెన్నెల, 
ఆ వెన్నలనే కాటువేసే అందంతో నువ్విలా, 
రెయికే కోరిక పుట్టే, 
నిన్ను జాబిలిని చేయాలని, 
దివి సీమకు మునుపెన్నడు లేని శోభ తేవాలని..

జతను కోరుతున్నా

ఎదురు చూపులని దాచిపెట్టుకున్నా...
నీ కను సైగలతో జతను కోరుతున్నా... 

ఆహ్వానం

నా కనులలోని కలలకు ఆహ్వానం ఉంటే మొదటి పత్రిక నీకే...

కలిసే విరిగాము కలలే విడిచాము

పెదవే ఉంటే మాటలు వచ్చేవేమో మనసా..
నీకు నోరు ఉంటే అడ్డు వేసేవుంటావు..
ప్రేమ తెలపడానికి తెలియని బాష నేర్చుకున్నావు..
కానీ ఆ ప్రేమను ఆపడానికి ఒక్క మాట చెప్పలేకపోయావు..
నీ తప్పో నా తప్పో కలిసే విరిగాము కలలే విడిచాము..
దిగులు చెందకు జోరు పెంచకు..

 నా మది ముత్యమై వెలుగుతుంది

కడలి తాకే ప్రతి చినుకు ముత్యం కాదు...
కానీ నన్ను తాకే నీ ప్రతి భావం నా మది ముత్యమై వెలుగుతుంది...

మార్పు ఉండదు

మిగిలిన జీవితాన్ని పగిలిన మనసుతోటే చూస్తే గతమే మళ్ళీ మొదలౌతుంది తప్ప మార్పు ఉండదు..

కనులు మూసి అనుభవించాలి

ఆకాశం నల్ల చీర కట్టే అందాన్ని కళ్ళు తెరిచి చూడలేము కనులు మూసి అనుభవించాలి...

నడుమ నలిగే మనసు తెలియకనే ఏడవసాగింది

ఎంతో సంతోషం కలిగినప్పుడు రాలేదు కన్నీళ్లు...
బాధ పడినప్పుడు తడవలేదు కనులు...
కానీ నిను వీడి నాకు నేను దగ్గర అవుతుంటే...
అది సంతోషమో లేక బాధనో తెలియక తడబడుతు...
కనుపాపకు దగ్గరౌతున్న సంతోషంలో కనురెప్ప వాలుతుంటే...
వెలుగు లేదిక నాకు అంటూ కనుపాప బాధపడుతుంటే...
నడుమ నలిగే మనసు తెలియకనే ఏడవసాగింది...

సడి ఉన్నంత కాలం

అలల మీద నురుగు జీవితం ఆ అలజడి ఉన్నంత కాలం...
నా మది లయాలో నీ స్నేహ జీవితం ఆ సడి ఉన్నంత కాలం...

జీవనం అన్నదే పోరాటం

నీ గమ్యం చేరాలంటే ఎదురీదు...
ఒక గమ్యం కావాలనుకుంటే అలలతో సాగిపోతుండు...
జీవితం ఒక పోరాటం కాదు...
జీవనం అన్నదే పోరాటం...
దారి చేసుకుంటూ పోరాడకు...
దారి ఉన్నవైపు నీళ్లలా సాగిపోతుండు...

మరో లోకం నీతో స్నేహం

మరో లోకం నీతో స్నేహం...
చిరు స్వప్నం నాకు ఈ క్షణం..

సంతోషానికి నెలవు

ఎప్పుడు చెప్పింది నెల నింగికి తన ప్రేమను? ఎందుకు కురిపిస్తుంది వాన, నింగికి ఆ ప్రేమ లేకున్నను?
ప్రేమను దాటి మనసులు కలిస్తే స్నేహం దాటి మనసులు మెలిగితే,
దూరం ఒక పదం మట్టుకే అవుతుంది,
సంతోషానికి నెలవు తెలియకనే మనలో రూపు చెందుతుంది...

చిల్లి గవ్వ

చిల్లి గవ్వ లేకుంటే చలామని కాలేవు...
చినిగిన బట్ట వేసుకున్నా డబ్బు ఉంటే ఆదర్శం ఔతావు...
ఎదిగే కొద్ది ఒదగాలి...
ఎదగకుండా ఒదిగినా దేనికి కొరగావు...

మెరుపులా కాదు మెరిసే నక్షత్రం లా

అప్పుడప్పుడు కనువిందు చేసే హరివిల్లు కూడా చినుకు ఆగేవరకు ఆగుతుంది, అప్పుడప్పుడు వచ్చే చినుకు కూడా మేఘం కరిగేవరకు కురుస్తూవుంటుంది, కానీ ఇప్పుడు తోడుండే నీ స్నేహం కనిపించదేమి వినిపించదేమి? ఎంత మాత్రం మనసులో ఉన్నా నిసబ్దంగా ఉంటే ఎలా? నీ పలకరింపు నాకు తొలకరి, నీ కనుసైగే నాకు హరివిల్లు, ఉండలేకున్నా వచ్చి పోతుండు, మెరుపులా కాదు మెరిసే నక్షత్రం లా కొంత సేపు ఉండి పోతుండు....

ధైర్యం చెయ్యి ఓ మనసా నీ మనసును వెళ్లబుచ్చుకో

ముసురుకున్న చీకటిలో కంటి పాపను ఎవరు చూస్తారులే,
మసుగు వేసిన మనసు ఎవరికి అంతుచిక్కదులే, ధైర్యం చెయ్యి ఓ మనసా నీ మనసును వెళ్లబుచ్చుకో..... 

నా తీగను తెంచుకుని ఎగరాలని చూస్తున్నా

నువ్వు తారకవు దూరంగా ఉంటూ తళుకుమంటుంటావు...
అందలేనే నిన్ను నేనొక గాలిపట్టాన్ని...
వెలుగులో మట్టుకే ఎగురుతుంటాను...
చీకటి వరకు ఉండలేను...
చిన్న గాలిని తాలలేను...
చినిగిపోయే మనసు నాది...
నేల వాలే రాత నాది...
నువు కనిపిస్తావని చూస్తున్నా...
నా తీగను తెంచుకుని ఎగరాలని చూస్తున్నా...

ఏకాంతం ఒంటరితనం

ఏకాంతానికి ఒంటరితనానికి ఒక్కటే తేడా అది తోడు....,
మనకు మనం తోడుంటే ఏకాంతం....,
లేని వారి ఆలోచన తొడుంటే ఒంటరితనం...

ఇప్పుడు కలిసావని కాదు

ఇప్పుడు కలిసావని కాదు
ఎప్పుడో ఎందుకు కలవలేదని అనిపిస్తూ ఉంటుంది.,
కలిసిన ఆ క్షణం ఏమైందో తెలియదు గాని
కలవకపోతే ఏమైపోయేదో అని అనిపిస్తూ ఉంటుంది.,
కలిసిన తర్వాత కలవో కల్లవో తెలియలేదు గాని
నిన్ను కలవరించని క్షణం ఏదైనా ఉందా అని అనిపిస్తూ ఉంటుంది.,
కలుసుకున్న ప్రతీసారీ కలవరపాటో,ఖంగారో తెలియలేదుగానీ
తరలిపోకు కాలమా అని అర్ధించిన
వేడుకోలులెన్నో అని అనిపిస్తూ ఉంటుంది.,
కలుసుకోవాలని వేచిఉన్న సమయంలో 
గడిచిన యుగాలెన్నో తెలియలేదుగానీ
కనుమరుగైపోతున్న నీ రూపం 
నా కళ్ళలో నీరై పారుతుంటే
ఆ వేదన నా వల్ల కాదనిపిస్తుంటుంది.,
ఈ కలయిక 'కల 'కాలమో ఏమో తెలియదుగానీ
ఈ మనసిక నీవై నీ వైపే సాగుతోంది మరి..!!

గొప్పతనం

మురళిని పలికించే వాడికన్నా దానిని చేసినవాడి నేర్పే గొప్పది,
వెదురులో మౌనం కాదు రాగముందని తెలుసుకున్న వాడి మనసే మధురమైనది..

అదే పువ్వు అదే నవ్వు

వసంతానికి ఒక కొత్త పువ్వు పరిచయం అయితే, 
ఏమిటా పువ్వు అనుకున్నాను, 
చిరు మొగ్గగా ఉన్నప్పటిది,
మరో వసంతానికి పువ్వులా విచ్చుకుంది, 
కానీ అదే పువ్వు అదే నవ్వు అని తెలిసింది...

పంచెను తన ప్రేమను

రవి కిరణమై భువిలో ప్రాణం పోసుకొని చిగురించిన ఒక తీగ..
మదినంతా అల్లుకొని పంచెను తన ప్రేమను..

మమకారానికి మాధుర్యానికి ఎంత తేడా

మమకారానికి మాధుర్యానికి తేడా కన్న పేగుకు ఎంచుకునే తాళికి ఉన్నంత దూరం...
ఏది దూరమైనా మనసు ఒప్పుకోదు ఎంత కష్టమైనా పోరాటం ఆగిపోదు...
ఏది ముఖ్యమో తెలుసుకోవడం కష్టం కానీ రెండు సాధించడం సాధ్యమే...
ఇరువైపులా ప్రేమకు లొంగిపోతే విజయం తధ్యమే...
ఇప్పుడు ముద్దాయివే కానీ తీర్పు తల్లిది కదా నీకు శిక్ష పడదు...
చేరే తీరం నీ చెలినే కదా నిన్ను కాదనదు...
ధైర్యం గా కాదు ప్రేమతో పోరాడు... 
కోపంగా కాదు క్షమాపణతో మొదలుపెట్టు...

తీరపు మనసును గాయపరిచిన కెరటం

ఎందుకో లేవనంది కెరటం,
తీరానికి మాట ఇచ్చి నింగి అంచులోనే ఆగిపోయిన కెరటం,
మనసులో తడి చేర్చుకుంటూ ఎదురుచూసే మట్టిని తాకలేక,
దాని కనులను తడిచేసిన కెరటం,
ఎండ వేడికి ఆవిరై తీరాన్ని తాకుతానంది,
కానీ మబ్బు నీడకు అక్కడే ఉండిపోయిన కెరటం,
సుదూరాలకు చేరుకొని దారి మరచిన కెరటం,
తీరపు మనసును గాయపరిచిన కెరటం...

మరచిపోతున్నా నిను మరచిపోవాలని

రాత్రంతా కలలా నా బుర్రలో,
పగలంతా చప్పుడు చేస్తూ నా గుండెలో,
అలా ఇలా తిరుగుతూ ఉంటే, 
మరచిపోతున్నా నిను మరచిపోవాలని....

ఏ ల్యాబ్ చూడని రియాక్షన్ మనది

H2SO4 లో మునిగినా కరిగిపోలేదు నా మనసు, కానీ కంటి చూపుకే విల విల లాడిందే, 
NACL లో పెట్టినా ప్రిసర్వ్ కాలేదు నా వయసు, నిన్ను చూసాక ఎన్ని జన్మలైనా వేచివుంటానంది, 
కెమికల్స్ లేని కెమిస్ట్రీ మనది, 
ఏ ల్యాబ్ చూడని రియాక్షన్ మనది, 
HE+SHE అనే కొత్త ఫార్ములాకు పేటెంట్స్ మనదే, న్యూక్లియర్ రియాక్షన్ లా ఎప్పటికీ ఆగదులే...

ఏమి చేసినా మరింత పెరిగేదే ప్రేమ

ప్రేమ మరకేమో అనుకొని వాడాను టైడ్,
మిల మిల లాడింది అవాక్ అయ్యాను,
అది బ్యాక్టీరియా అనుకొని,
డెటాల్ వాడాను,
క్లీన్ గా అయిపోయింది,
మిస్టేక్ అనుకొని,
నటరాజ అరేసర్ వాడాను,
కరెక్ట్ అయిపోయింది,
తెలిసింది ఏమి చేసినా మరింత పెరిగేదే ప్రేమ,
మెరిసేదే ప్రేమ అని..

మైమరపు నువౌతావు

నీలో ప్రేమ ఆకాశమంత,
చేరిందెవరో ఆ వెన్నెల తోట,
మురిపించే నవ్వులతో,
కవ్వించే అల్లరితో,
ను చేసే మాయాజాలం,
ఏ వర్షం చేస్తుంది,
నీ కన్నుల మెరుపులు,
ఏ మేఘం చూపిస్తుంది,
అనుకోగనే వాలే తలపుల్లో,
మొదటి వలపు నువౌతావు,
అనిపించగానే కలిగే హాయిలో,
మైమరపు నువౌతావు.....

కలలు కంటూ సాగిపోతోంది

నింగిలోని తీరాన్ని చేరలేక పోయింది,
నీళపై నావకు ఆశ పోయింది,
ఉదయించే సూరీడు కడలి అంచును తాకుతుంటే,
నింగి వాలెనేమో అని ఆశతో సాగింది,
ప్రతి పొద్దు పయనిస్తూ,
ప్రతి రేయి విలపిస్తూ,
మోసపోయిన మనసుతో,
ముందు సాగే ప్రేమతో,
ఎప్పటికి అందలెకున్నా,
ఎప్పుడు అన్న ప్రశ్న లేకుండ,
అలసిపోయేదాకా ఆవిరయ్యే దాకా,
కలలు కంటూ సాగిపోతోంది...

బోడిగుండంత సుఖం

ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం...
నూనె జారినంత సులభం మాట జారడం...
కొండను చెక్కడమంత కష్టం తనను తాను మార్చుకోవడం...
రాయిని జీర్ణించుకోవడమంత కష్టం ఒకరి మనసును అర్థం చేసుకోవడం...

నిను చూసి పాఠాలు నేర్చుకున్నవే

పువ్వు నేర్చిన పాఠం నీ కనులు, 
విచ్చుకుంటే వాటిలా విచ్చుకోవాలి,
చిరు గాలికి నేర్చిన పాఠం నీ మాటలు,
వాటిలా మెల్లగ తాకాలి,
రంగులు నేర్చిన పాఠం నీ సొగసు,
దానిలా రంజింపజేయాలి,
తీగ నేర్చిన పాఠం నీ రూపు రేఖలు,
వాటిలా అల్లుకుపోవాలి,
జగతిలో ప్రతి అందము నిను చూసి స్ఫూర్తి పొందినవే...

మిన్నంత తన మనసు

తెలియదు జాబిలికి తాను ఎంత అందమని,
చెక్కిళ్ళు పొంగితే తాను పౌర్ణమి అవుతుందని,
మచ్చలే తన మమకారాలు,
మిన్నంత తన మనసు,
మిణుగురంత తన కోరిక,
ఒంటరి జీవితం,
కానీ తన వెన్నెల అందరికోసం...

చివరికి చక్కటి బంధం మన సొంతం... 


నింగి నేల అభిప్రాయాలు వేరైనప్పుడు,

మెరుపులూ వస్తాయి చల్లటి చినుకులూ కురిపిస్తాయి,

చివరికి చల్లటి గాలి ప్రకృతి సొంతం,

మనసు మనసు కలవనపుడు,

దూరము కలుగుతుంది ప్రేమ పెరుగుతుంది,

చివరికి చక్కటి బంధం మన సొంతం... 

వాలీ వాలని కనులు కురిసి కురవని మేఘం కవ్విస్తూ ఆడుకుంటాయి


వాలే మేఘం సొగసెంతో తగిలే చినుకు హాయిలో ఉంటుంది,

వాలే కను రెప్పల సొగసు నిదురించే తీరులో కనిపిస్తుంది,

కానీ వాలీ వాలని కనులు కురిసి కురవని మేఘం కవ్విస్తూ ఆడుకుంటాయి....

గాలిని అడుగు

గాలిని అడుగు నీ అందం గురించి ఎంత మంది గుసగుసలాడుతున్నారో చెబుతుంది.. Ask the wind; it will show you the countless whisperers talking about y...