అందీ అందని జాబిలీ



అందదు ఆ  జాబిలీ...

నాకందెను ఈ జాబిలీ...

తరగని ఓ ప్రేమతో..

పెరిగే చిరునవ్వుతో..



ఆకాశానవోకటున్నది...

నా చెంతనే వొకటున్నది..

మనసులో వున్నది ..

నా ప్రేయసై  వున్నది..



ఆ జాబిలి చిరునామా తెలిసినా ..

చిరుకబురే పంపలేకున్నా..

ఈ జాబిలి నా చెంతనే వున్నా..

ఓ ముద్దు ఇవ్వలేకున్న...



ఆ జాబిలిని చేరలేకున్నా .

ఈ జాబిలిని వదలలేకున్నా ...

కౌగిట్లో బంధిస్తూ రేయంతా వుండిపోతాను... 

No comments:

earth itself envies you

At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...