జై జవాన్







నా తరపున సుభ గారి తరపున అందరికి గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు




నాలోని ప్రాణం నీవే

నాలోని ధైర్యం నీవే

నావెనుక సైన్యం నీవే భారత దేశం


నాలోని ఉప్పెన నీవే

నాలోని ఆవేశం నీవే

నాకున్న శకలం నీవే భారత దేశం



నీవిచ్చిన ప్రాణం కాదది వరమనుకుంటున్నా

నీకంటూ ఇస్తూనే చరిత్రనైపోనా

నీవే ఒక యుగమైతే

ప్రతినిమిషం నేనౌతా

కవచంలా కౌగిలిస్తూ

ప్రేమను అందిస్తా



నలుదిక్కుల మానవహారం

నీమెడలో పూలహారం

నీవే మా దేవత వంటూ పూజలు చేస్తున్నాం

త్యాగాన్నే కోరికచేస్తూ నీకర్పిస్తున్నాం

మాలోని రక్తపు బొట్టుకు మావారిని కాపాడు

చిరునవ్వులు పంచుతూ చిరకాలం తోడుండు



ఓ తల్లిగా కన్నీరే

చిందించిన మాకోసం

దిగులే పడకు ఎన్నడూ

మరు జన్మ ఉంటే నీతోనే

ఎంత దూరం మా పయనం నీ గర్బంలోకే కదా
ప్రాణమిస్తే మరు క్షణం నీ బిడ్డలమౌతాం కదా

నీ ఒడిలో చోటిస్తూ లాలించు నను ఓదార్చు

ఈ బాధను మరిచేలా నీ ఎదపై ఆడించు





4 comments:

Anonymous said...

మరుజన్మవుంటే నీతోనే
ఎంతదూరం మా పయనం....
బాగుంది

Kalyan said...

@ధన్యవాదాలు తాత గారు :)

Reddy Kirankumar MB said...

దేశం అంటే ఆ మట్టి పై పుట్టిన ప్రతి ఒక్కరి హృదయలయంలో
కొలువుతీరి స్పూర్తిని నింపే ముందుకు నడిపే భారతమాత అని గుర్తుచేసావ్

kalyan said...

@రెడ్డి గాడు జైహింద్ :)

ఆ మాత్రం వర్ణించగలనని అనుకుంటున్నా

కోట్ల పదాలు రాసినా నీ కనురెప్ప వెంట్రుకవాసి వర్ణనకే సరిపోతుంది. ఓ అందమా! నేను నా జీవిత కాలంలో ఆ మాత్రం వర్ణించగలనని అనుకుంటున్నా... My dear ...