కలనై నేనే కదులుతాను



















తోడు రావే రామ చిలుక


పొద్దు  పోయే వేళాయే


జాబిలమ్మ తోడు ఒచ్చినా  


చిలక పలుకులు లేవాయే





తారలనుకొని మోసపోకు


తోట పూచినా మల్లె పూలు


పాములనుకొని భయపడకు


నీ కబురు విని సిగ్గు పడ్డ మల్లె తీగలు


నన్ను చూసి ఒంటరనుకునేవు 


నీ తలపులుండ నే ఒంటరి కాదు





రెక్కలందుకో వేగమందుకో


రెప్ప పాటున వాలిపోవే


రేయి దాటిన దిగులు లేదు


ఎక్కడునా భద్రము


దూరమైతే కబురుపంపు


కలనై నేనే కదులుతాను 



1 comment:

రసజ్ఞ said...

పాములనుకొని భయపడకు
నీ కబురు విని సిగ్గు పడ్డ మల్లె తీగలు బాగుంది!
చిట్టి చిలకమ్మా
కళ్యాణ్ గారు పిలిచారా?
బ్లాగులోకెళ్ళావా?
కలవై కదిలావా?
టపావై మిగిలావా?
మా కంట పడ్డావా?
మాతో వ్యాఖ్యను పెట్టించావా?

print with my eyes

என் இதயத்தில் பதிந்து வைத்ததை, என் கண்கள் காகிதத்தில் அச்சிடும் வல்லமை கொண்டிருந்தால், உன் படத்தை அச்சிட்டு ரசித்திருப்பேன். If ...