మనసు నీవని చెప్పదలచినా మమత కోవెల కట్ట దలచినా బాష కరువైతే అ ఆలోచనే అంతంత మాత్రమే ముద్దు పెట్టే పెధవులున్నా ప్రేమించే మనసు ఉన్నా అడగడానికి బాష లేకుంటే అ క్షణము వ్యర్ధము బాష పరిబాషలెనున్నా పరవశించే మనసుకు తెలుగు బాష లేకుంటే కట్ట దాటదు అ భావము |
తెలుగు బాష లేకుంటే కట్ట దాటదు అ భావము
కలనై నేనే కదులుతాను
తోడు రావే రామ చిలుక పొద్దు పోయే వేళాయే జాబిలమ్మ తోడు ఒచ్చినా చిలక పలుకులు లేవాయే తారలనుకొని మోసపోకు తోట పూచినా మల్లె పూలు పాములనుకొని భయపడకు నీ కబురు విని సిగ్గు పడ్డ మల్లె తీగలు నన్ను చూసి ఒంటరనుకునేవు నీ తలపులుండ నే ఒంటరి కాదు రెక్కలందుకో వేగమందుకో రెప్ప పాటున వాలిపోవే రేయి దాటిన దిగులు లేదు ఎక్కడునా భద్రము దూరమైతే కబురుపంపు కలనై నేనే కదులుతాను |
హాయిగా నవ్వించే హాస్యము
హాస్యము హాస్యము హాస్యము హాయిగా నవ్వించే హాస్యము కూడదు కూడదు కోపము కోపానికి విరుగుడే హాస్యము నవ్వే పెదవులు చెప్పే హాస్యము అమాయకాన్ని చూపే హాస్యము తన్నులు తింటే పండే హాస్యము కోపం లోను కరకర హాస్యము మతే లేని తికమక హాస్యము అర్థం కాకుంటే అది ఒక హాస్యము నవుతూ పోతే అంతా హాస్యము హాస్యమే లేకుంటే అంతా వ్యర్ధము .. హాస్యము హాస్యము హాస్యము హాయిగా నవ్వించే హాస్యము చిన్నారుల తడబాటే హాస్యము బామల తాతల గొడవలు హాస్యము ప్రేమలోని అలకలు హాస్యము తనకు తాను మాట్లాడితే హాస్యము పరుగులు తీసే చినారి హాస్యము గుబులు పుట్టించే కన్నె సైగ హాస్యము హాస్యము హాస్యము హాస్యము హాయిగా నవ్వించే హాస్యము నవ్వించే వన్ని హాస్యము కాదు నవ్వు రాని వన్ని హాస్యము కాకుండా పోదు మనమే హాస్యమైతే జీవితమే ఆనందము ఇంకోరిని హాస్యము చేస్తే అది నీలో ఒక లోపము హాస్యము హాస్యము హాస్యము హాయిగా నవ్వించే హాస్యము |
పదే పదే పలకరించే ప్రాణంలా నీవో వరం..
ఏదో ఏదో నీలో సగం నేనై పోతునానే పొద్దున్నే కళ్ళను మరచి నిన్నే అనుకుంటానే స్నేహమా నీవే కదా నాలో దాగున్న నిజం పదే పదే పలకరించే ప్రాణంలా నీవో వరం... రానివే చీకటి నాపైకి నీ నవ్వులో దాగిన వెన్నల చూపి వెలుగే తెపిస్తానే రానివే ఓటమి నా వైపు నీ స్నేహాన్ని మించిన గెలుపే లేదని ఓటమినే ఓడిస్తానే ఏది లేదని నీలోనన్న ప్రశ్నే లేదు అందలానికి మించిన అనురాగం ఉన్నది ఏది ఉందని నాలో అన్న అనుమానమే లేదు అంతా నీవే ఆణువణువూ నీ స్నేహమే.. |
నన్నే అడుగులు వేయించావు
అందని ఆకాశం నీవు అందాల ఓ పావురం నేలపై రాలిన ఎండుటాకులా చేసాను ఓ సాహసం రెక్కలు లేవు పక్షిని కాను గాలికి తోడై వస్తున్నా ఎంత సేపని గాలిలో ఉండను చావని ఆశల బరువుతో ఉన్నా నీతో స్నేహం కల అనుకున్నానే నాకై చినుకై దిగివోచ్చావే సీత కొకలా నటిస్తున్నా నన్ను చిలుకలా మర్చేస్తున్నావే నాపై అందరి అడుగులు పడకుండా నన్నే అడుగులు వేయించావు నీకిది తెలియదేమో ఈ ఎండుటాకునే పైపైకి చేసి ఒక నక్షత్రంల మర్చేస్తునావు నీకెలా రుణపడి ఉండను అ రుణాలకే అతీతంగా ఓ బందానిచ్చావే... |
Subscribe to:
Posts (Atom)
earth itself envies you
At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...