అమ్మ

మనిషైనా మృగమైనా మారంది అమ్మ,
చీమకైనా దోమకైనా ఉంటుంది అమ్మ,
అమ్మున్న చోట దేవతల పంట,
వరమిచ్చే దేవుడు నీ పూజలడిగాడు,
తను అడగకనే మనకు వేసింది భిక్ష,
ప్రాణాలు ఇచ్చి దీక్షలను చేసి,
యమ పాశాన్ని కూడా ఎదిరించే శక్తి,
తన పేగు వాడినా మది వాడనీదు,
తనలోని శోకం అదృశ్య లోకం,
ఎదురెళ్లకు తన మాటకు,
పసిపాప కోపం తనలోని ఆవేశం,
నీ దెబ్బలు పలికే భాష అమ్మేను కదరా,
తన చిరునవ్వే కనిపించే స్వర్గం చూడరా,
ఎంత చెప్పినా ఏమి చేసినా ఆ రెండు అక్షరాల ఋణము తీరుతుందా...

No comments:

గర్వం లేని అందం

తన కొప్పులో ఎన్ని అందమైన పూలు ఉన్నా కొమ్మకు గర్వం ఉండదు, ఎంతో అందం నిన్ను కప్పినా నువ్వు చాలా సరళంగా ఉంటావు... कितने भी खूबसूरत फूल हों उसके...