నీతో కలిగిన బంధం చూపుతోటి కాదేమో

ప్రతి ఉదయం వెలుగు తాకినా, సూర్యుడిని చూడాలని అనిపించదు, 
రోజు వస్తాడని చులకనేమో,
కానీ నీ కబురు అందినపుడల్లా, 
నిన్ను కలవాలని అనిపిస్తుంది,
నీతో కలిగిన బంధం చూపుతోటి కాదేమో...

No comments:

రక్తమా లేక ప్రేమనా

రక్తం నిండిన నా హృదయంలో నిన్ను ఉంచి నీ ప్రేమకు మరక అంటించలేను, అందుకే మరో హృదయం కావాలని దేవుడిని కోరాను, కుదరదంటూ, రక్తమా లేక నీ ప్రేమనా అని...