నా చెలి పాదము జాగ్రత


























నా చెలి పాదము జాగ్రత్త 


చక్కని పాదము జాగ్రత్త





ప్రేమతో అడుగులు వేస్తూ

నను చేరే పాదము

ఓ గోరింటాకు తననేమనకు

తనతో స్నేహం చేస్తూ ఎర్రగామారు

తను చూసే సరికి పెదవిపై చిరు నవ్వుగా మారు ... 




14 comments:

సుభ/subha said...

మీ కోసమైతే పాదం ఒకటేనా..,చెలి పెదవులపై నవ్వులు, జడలో పువ్వులు, బుగ్గలలో సిగ్గులు అన్నీ ఎర్రగానే మారిపోతాయ్ కల్యాణ్ గారు.

వనజ తాతినేని/VanajaTatineni said...

baagundi. subha gaari comment kooDaa

రసజ్ఞ said...

బాగుందండీ! సుభాషిణి గారూ జడలో ఎర్రని పువ్వులకన్నా తెల్లవే బాగుంటాయి ఏమంటారు? మిగతావన్నీ మీతో ఏకీభవిస్తున్నా!
కళ్యాణ్ గారూ మీరు అన్యధా భావించకపోతే నాకు మీరు పెట్టిన చిత్రం నచ్చలేదు! అంత మంచి వచనానికి ఏ పారాణితో ఉన్న పాదాలో బాగుంటాయి కాని ఇది చాలా గజిబిజిగా ఉంది!

Kalyan said...

@సుభ గారు హహహ ఒక్కసారి అల తీసుకేల్లిపోయారు ఊహల్లోకి , సంతోషం సంతోషం , చాలా చక్కగా చెప్పారు ....

@వనజ వనమాలీ గారు ధన్యవాదాలు సుభ గారు ఎప్పుడు అంతే చక్కగా ఏదోకటి చెలోక్తులు విసురుతుంటారు అది కాస్త ఓ మంచి కవితై కూర్చుంటుంది :)

@రసజ్ఞ గారు నాకోసం చెప్తారు కాబట్టి అనుకోడానికి ఏమి లేదు , కదా మీకే కాదండి నాకు అ చిత్రం నాకు నచ్చలేదు :( కాని గూగుల్ లో దొరకలేదు నాకు, సరే పెట్టాలి కదా అని పెట్టేసాను , అదేదో జిలేబి పారాణి లాగ ఉంది హహ :) ..
మీకు ఏమైనా చిత్రము లబిస్తే నాకు చెప్పండి, నేను వెతుకుతాను.. మీ స్నేహపూర్వక సలహాలకు ఎప్పుడు మీరు ఆహ్వానితులే.. ధన్యవాదాలు :)

Unknown said...

చాలా బాగుందండీ! చివరిలో గోరింటాకుకి మీరిచ్చిన సలహా ఇంకా బాగుంది ;)

సుభ/subha said...

రసగుల్లాగారూ తెల్ల గులాబీనే పెట్టుకున్నా అది కాస్తా ఎర్ర గులాబీగా ఐపొయిందని నా ఊహ. ఏమంటారూ? వనజ గారు నా వ్యాఖ్య నచ్చిందన్నదుకు ధన్యవాదాలండీ. కల్యాణ్ గారు చలోక్తి కాదండీ బాబూ నిజమేనండీ ; )

Kalyan said...

@సుభ గారు :) నిజంగానా అయితే మీకు :) :) :) :) ధన్యవాదాలు

రసజ్ఞ said...

సుభ గారూ
అలా అంటారా? అయితే సరే! మీ బ్లాగులో మొన్న రసజ్ఞ అనే వ్రాస్తే మర్చిపోయారనుకున్నా ఇంకా గుర్తుందనమాట! ఏవండోయ్ మనమిలా ఇక్కడ ముచ్చట్లు పెడితే కళ్యాణ్ గారు అసలే మాష్టారంట బెత్తం పట్టుకుని వస్తారేమో!

Kalyan said...

@రసజ్ఞ నా స్నేహితులని కొట్టనండి ఎప్పుడు .. మీకు అటువంటి భయము వలదు కాక వలదు.. మీరు గాక ఇంకేవరండి ముచట్లు చెప్పేవారు .. కానివ్వండి నేను ఆస్వాదిస్తాను

" బెతమెత్తే మాష్టారు బౌ బౌ మాష్టారు ...
నవ్వించే మాష్టారు మియవ్ మియవ్ మాష్టారు...
అరిచే మాష్టారు బెక బెక మాష్టారు...
పాఠాలు చెప్పే మాష్టారు పధతైన మాష్టారు.. " - ఏదో " బెత్తం పట్టుకుని వస్తారేమో!" ఈ వాక్యం చూసి అసలు మాస్టార్లు ఎన్ని రకాలో అనుకోని రాసినది ఛలోక్తి మాత్రమె :)

రసజ్ఞ said...

హమ్మయ్యా ఆ అభయమిచ్చారు! అన్నీ వ్రాశారు కానీ ఒక్కటే లేదు
క్రమశిక్షణలో పెట్టే మాష్టారు కళ్యాణ్ మాష్టారు!

Kalyan said...

@రసజ్ఞ గారు నవరసభరితం అని ఊరికే అన్నారా పెద్దలు :)

Kalyan said...

@చిన్ని ఆశ గారు ధన్యవాదాలు మీ పేరు బాగుంది అ బొమ్మ చాలా బాగుంది :)

జ్యోతిర్మయి said...

ఏదో ఈ మధ్య కాస్త పనిలో ఉండి ఈ వైపు రాలేదు, నా పరోక్షంలో చాలా చాలా కబుర్లు చెప్పేసుకు౦టున్నారు.
గోరి౦టాకుతో మీరు చెప్పడం బావుంది కళ్యాన్ గారూ...

Kalyan said...

@జ్యోతిర్మయి ధన్యవాదాలు ఏదో గోరింటాకు చెప్పిన మాట వింటుందని ఒక ఆశ :) మీ పరోక్షం అనేది వట్టి బ్రమ అలా చెప్పుకున్నా కూడా మీ వెలుగు దేనికి తగలకుండా ఉండదు

earth itself envies you

At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...