వెన్నలే తగిలినా కందిపోయే బుగ్గలు,
కానీ కొండనే కరిగించే పదునైన చూపులు,
నువ్వు సౌందర్యానివో లేక ఆయుధానివో,
ముళ్ళు పువ్వు కలిసిన రోజావో,
గుచ్చుకున్నా గుండెలో దాచుకుంటా,
వాడిపోనీకుండా కనుపాపలో ఉంచుకుంటా...
❤️💔
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
నిప్పులు గక్కే అగ్నిపర్వతం నుంచి చల్లని నీరు చిమ్మినట్టు, గాఢ నిబద్ధతతో నిండిన నీ హృదయం నుంచి చల్లని చిలిపి తుంపర్లు ఎగసి పడుతుం...