నవరసభరితం















నిర్మానుష్యం ఆ ఆకాశం

నిర్వీర్యం అ వెన్నల సౌధం

ఎన్ని చుక్కలు వుంటేనేమి

ఎంత చీకటి కమ్మితేనేమి

జ్యోతి లేని ఆ నింగి నీరు లేని కడలిలా వెల వెల పోతుంటే

నేనున్నానంటూ చిగురించింది ఓ పరిమళం

అది చల్లని గాలో లేక వెచ్చని వెలుగో తెలియదు

ఎప్పటికి నిరంతరాయంగా సాగిపోయే స్వేచ్చా జీవిలా

అందరికి ప్రాణమందించే స్నేహ భావంలా

నవరసాల సమ్మేళనంతో నవరసభరితంగా సాగిపోతోంది


10 comments:

మౌనముగా మనసుపాడినా said...

బాగుంది

జ్యోతిర్మయి said...

అమావాస్య దాటి, నెలవంక వెన్నెల తోడుగా అడుగిడగా..కడలి అలలలో చైతన్య ఝరి..నవరసభరితంగా సాగే వెన్నెల ప్రవాహంలో అరవిరిసిన పువ్వుల పరిమళాలకు తోడుగా ప్రకృతికాంత కళ్యాణ రాగాలు...

రసజ్ఞ said...

వచ్చేసా కళ్యాణ్ గారూ! మీకు నా హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు! మీ జీవితం నవరసభరితంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను! wish you a very happy birthday!

జ్యోతిర్మయి said...

కళ్యాణ్ గారూ...ఇవాళ మీ పుట్టినరోజా.. చెప్పనే లేదు. జన్మదిన శుభాకాంక్షలు...మీ జీవనయానం నవ్వుల నదిలో పువ్వుల పడవలా సాగిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

శోభ said...

కవిత బాగుంది కళ్యాణ్‌గారూ...

మీకు హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు..

kastephale said...

పుట్టిన రోజు శుభకాంక్షలు.

మధురవాణి said...

Happy Birthday to you.. Kalyan garu! :)

సుభ/subha said...

కళ్యాణ్ గారూ జన్మదిన శుభాకాంక్షలు..పైన జ్యోతిర్మయి గారి కామెంటు అదుర్స్. ఇక నవరసజ్ఞభరితం గురించి ఎంత చెప్పినా తక్కువే లెండి. కవిత బాగుంది చాలా.

Apparao said...

కళ్యాణ్ గారికి సంకలిని తరఫున జన్మదిన శుభాకాంక్షలు

http://www.sankalini.org/

Kalyan said...

ఇంతింతై వెలుగంతై
కోటి సూర్య కాంతులై
నా స్నేహమై
నా మంచి కోరుతూ
అందించిన సుభాకాంక్షలకు అందరికి నా ధన్యవాదాలు :)

earth itself envies you

At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...