ఆశించకుండా స్నేహమై పోతే..





నా తూరుపున సూరీడు ఉధయించలేదని...

సూర్యకాంతి పూయడం మానేస్తుంద ??

నా చెంతకు పూలు రాలేదని...

తుమ్మెద రాగాలు ఆపెస్తుందా ??

మనచెంతకు రానపుడు మనమే దారి మరులుతు..

ఏమి ఆశించకుండా స్నేహమై పోతే..

అ సూర్యుని వెలుగు నీపై పడుతుంది అ పువ్వులోని తీపి కూడా నీదౌతుంది..

స్నేహానికి ఆలయం..





చూడని ఒక లోకం..

స్నేహానికి ఆలయం..

ఒక మనసులో అది పదిలం...

అది నీదే నీదే నా నేస్తం..



చేరువున్న చందమామలా ఒక్కటే నా కనులలో...

దూరమైన తారకవైనా నీపై ఆలోచనలు ఎన్నో నాలో...

నిదురే లేని చీకటై నన్ను హాయిగా లాలిస్తావే..

ఇంతకు ఆ హాయిని చూడలేదు కాని పిల్ల గాలుల మహిమలు తెలుసు...

ఎంతకు నిను మరువనని తెలుసు నన్ను నేను మరచిపోతు...

నా అలవాటుకు వీడ్కోలు ..





ఇన్నాళ్ళు నాకోసం నీవునావ్...

సమయమంటూ చూడకుండా నాతోటి ఆడుకున్నావ్..

నిన్ను నే వదలలేకున్న వదలిపో నన్ను...

నా అలవాటుగా ఇన్నాళ్ళ నీ సేవకు వీడ్కోలు ఈరోజు...

స్నేహానికై చూస్తే మనము..





మబ్బులకై చూస్తే చీకటి...

వెన్నలకై చూస్తే జాబిలీ...

మనసుకై చూస్తే ప్రేమ..

జీవితానికై చూస్తే బంధాలు..

కోరికలకై చూస్తే దుఖం...

ఆరోగ్యానికై చూస్తే నియమం...

ఆమనికై చూస్తే కోయిల..

అందానికై చూస్తే ప్రకృతి..

స్నేహానికై చూస్తే మనము..

ఇలా ఒకటికై చూస్తే మరొకటి తారసపడక తప్పదు..

మన స్నేహం





కనుపాపల కలవరరింతకు తాలమేసే దారిలేదు....

ప్రాణమాగితే కాని వాటి శబ్దం తీరిపోదు....

మన స్నేహం వాటితో పోటి పడని...

వాటి సమయం కన్నా మన కాలం పెరిగిపోని...

అనుకోని వాన జల్లు..





అనుకోని వాన జల్లు నాపై కురిసింది...

బయపడుతూ తనలోని చలిని నాకై పంపింది...

అందుకున్నా ఆస్వాదిస్తూ హతుకున్న బయములేధంటూ...

నవ్వే మనసెపుడు వాడిపోదు...





నవ్వే మనసెపుడు వాడిపోదు...

నిదురనున్న కనులెపుడు కన్నీరు కార్చలేవు...

ఆలోచనకు ఎపుడు అలసట ఉండదు..

అన్ని కలసి ఉంటే సంతోషం నీతోడు..

పునమ్మి వెన్నల.





జాబిలమ్మ మారినా చీకటి నలుపు రూపము మారదు...

కాని ఆ చీకటి నమకాన్నే ఏదో ఒకరోజు పునమ్మి వెన్నలగా కురిపిస్తుంది...




గోపయ్య చినుకా రాధకై వచ్చావా...

రామయ్య చినుకా సీతకై వచ్చావా...

ఎవరికోసం వచ్చినా ఎవరై వచ్చినా...

ఇంతకాలం మాలాగ వేచి ఉండాలి మాటకోసం...

వరదై పొంగినా సరే చాలదు నీ నిరీక్షణ.. 
 
  

earth itself envies you

At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...