అలజడి లేని చల్లని చిరుగాలి ..








( మా స్నేహానికి గుర్తుగా ఆ కుందేలు )

నీ అల్లరి అలజడి లేని చల్లని చిరుగాలి ....


నీ పల్లవి కొందరికే వినపడే స్నేహపు మురళి...


నిశ్సబ్ధమైన చీకటిలో ఉర్రూతలూగే వెన్నల లోగిలి....


కలలలోను మదిలోను దాగిపోయే జ్ఞాపకాల సరళి..




  


మందేరా గొప్ప....








మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  


జాతి బేధము అసలే లేదు


కులమతాలతో పనియే లేదు


ఆడ మగల తేడా లేదు


మత్తు దిగిందా ఇక స్వర్గము చూడు





నడకలు రాని రోజులు తెలుసా ఇప్పుడు చూసుకో


కష్టాలు తెలియని చిన్నతనాన్ని గుర్తుచేసుకో


తప్పు కాదిది తప్పే కాదు


తప్పుటడుగుల తొలిరోజులు


ఒప్పు కాదిది ఒప్పే కాదని


ఒప్పుకుంటే మరి తప్పు


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





చూసావా ఆ జెండా గాలికి ఆడట్లేదు 


మత్తు మంత్రులు ఎగరేసిన మహిమ


దానికి కూడా దిగులు కాబోలు


దానిని పట్టించుకునే ప్రభుత్వానికి కూడా 


మందంటే తారక మంత్రము 


అ మంత్రము చెబుతూ కూటమి వేసి


మనకు కావాలి  స్వరాజ్యమనరా


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





మందు లేని అ సీసా చూడు


మన తలరాతలు చూడు


తన దిగులంత మనకిచ్చి


మన దిగులును పోగొట్టే త్యాగశీలి


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





అందరిని ఒకలా చూపుతుంది


కాని మన దారిని వేరు చేస్తుంది


అభిమానం మరీ ఎక్కువైతే


మెలుకవ రాని నిదురనిస్తుంది


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా

  

ఆలోచనలో స్థాయిలో మార్పు కావాలి
















చినుకు తడిపింది చూసున్నాను

అ చినుకే తడిస్తే చూడాలని ఉంది

ప్రేమించే మనసు చూసాను

మనసును ప్రేమించే తరుణానికై వేచివున్నాను

ఆగని కాలంలో ఆగిన రేణువై వున్నాను

అ రేణువును వెలుగుల రేడుగా మార్చాలనుకుంటున్నాను

ఇది వరకు అన్ని నేర్పించాలనుకున్నాను

ఇకపై నే నేర్చుకోవాలనుకుంటున్నాను......  

ఆడుతోంది నా యవ్వనం...














చల్లని చిరు గాలితో

చినుకుల సయ్యాటతో

పులకరించి పరవశించే ఈ సమయం

మెరుపుల మేనత్తకు

మబ్బుల మావయ్యకు

గొడవలతో హోరెత్తే ఈ సమయం

ఆగమన్నా ఆగనంది వయసుమీద ఉల్లాసం

చాలన్నా బలవంతం చేస్తోంది ఆ మేఘం

దారి తెలియక తికమక తో వాగు వంక పోతుంటే

చాలధంటూ చలి మంచు దారి కప్పుతుంటే

ఆగకుండా ఆవేశంతో ఆడుతోంది నా యవ్వనం...


అందరికి ఆదర్శమౌతుంది ..














మైకం నుంచి పుట్టిన ఆలోచనలో 
ఆవేశము
 తప్ప వివేకముండదు

మబ్బు మాయలో పడ్డ సుడిగాలికి వేగము తప్ప చెట్టును హత్తుకునే ఆలోచన ఉండదు

ఆ వేగానికి కట్ట వేస్తే ఎంతటి వరదలైనా ప్రాణమిచ్చే నీరుగా మారుతుంది

అందరికి ఆదర్శమౌతుంది ...


చిట్టి పొట్టి చీమలో ఎన్ని ఎన్ని యుక్తులో














చిట్టి పొట్టి చీమలో ఎన్ని ఎన్ని యుక్తులో

చక చక నడుచుకుంటూ పరిగెడుతూ ఉంటుంది

కొండైనా అది చక్కెరైతే నిమిషంలో కరిగిస్తుంది

పోట్టిధైనా గేట్టిదే తనకు మూడింతలు మోస్తుంది

ఎవ్వరికిందా పని చేయదు స్వాభిమానం కలది

పుట్టలు మేడలు కట్టేస్తుంది ఏ అడ్డమైనా ఎక్కేస్తుంది

దోచుకోదు ఎప్పుడు కావలసినది దాచుకుంటుంది

కష్టమైనా చేసుకుంటూ కాలం గడుపుతుంది

క్రమశిక్షణ కలది అది కొలవలేనిది


నమ్మకమే జీవితం











వదలలేని జీవితంలో వల్లమాలిన ఆప్యాయతలు


ఎంతదూరమో ఎంత చెరువో మన చెంతనున్నా తెలియదు


వాటికి లెక్కలేసుకుంటే ఫలితము రాదూ


నమ్ముకుంటేనే ఆ కల నిజమయ్యేది 

అదే లేకుంటే ఇంక ఈ జీవితమేది ...... 


earth itself envies you

At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...