కథాజగత్ - ఏకాకి -వింజమూరి అచ్యుతరామయ్య




కథ  :  ఏకాకి


రచయిత : వింజమూరి అచ్యుతరామయ్య





విశ్లేషణ రాసే ముందు కథాజగాత్ వారికి నా వందనాలు మరియు అభినందనలు.




బంధాలు అనుబంధాలు ఎలా అల్లుకుంటాయో చెప్పలేము ఎంత దూరం నిలిచుంటాయో చెప్పలేము. తమ ప్రయోజనాల కోసం కలిగించుకునేవి కొన్నైతే కాలంతో పాటు మసులుకునేవి కొన్ని. కథలో ఈ విషయం చాలా ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఎన్ని ఆస్తి పాస్తులున్నా ఐశ్వర్యాలు వున్నా తోడు నీడగా సాటి మనిషి లేకుంటే ఆ జీవితం వ్యర్ధమని రచయిత గారు చక్కగా వివరించారు. 





జానకమ్మ:


జానకమ్మ గారి పాత్ర చాల ముఖ్యమైంది. ఆప్యాయత ప్రేమానురాగాలకు నోచుకోని ఆవిడ వాటికి ఎంతగా పరితపించారో అర్ధమౌతోంది. తనకు సాయం చేసారనే ఒకే ఒక్క కారణం చేత తన ఇంటినే వారికి రాసించారు. ఇక్కడ ప్రేమానురాగాల విలువ అన్నది తెలుస్తుంది. మనిషికి కావలసింది ఆస్తిపాస్తులు కావు ప్రేమనురగాలనే కథాంశం ఎంతో బాగుంది.





ఇంట్లో  అద్దెకున్న కుర్రాళ్ళు :


జానకమ్మ గారి ఇంట్లో అద్దెకున్న కుర్రాళ్ళు తమ అవసరం తీరగానే వారి దారిన వారు వెళ్ళిపోయారు. మన జీవితంలో కూడా ఎంతో మంది అలా వచ్చి వెళుతుంటారు .వారి అవసరాలు తీరాక వెళ్ళిపోతుంటారు. వారిని ఎందుకు అని ప్రశ్నించే హక్కు మనకు ఉండదు. మన అవసారాలను గ్రహించగలిగితే మానవత్వం ఉన్నవారౌతారు లేకుంటే స్వార్ధ పరులౌతారు.





రామనాథ్ :


ఇంకా రామనాథ్ గారి విషయానికొస్తే భోగాలకు అలవాటైన రామనాథ్ కట్టుకున్న ఇల్లాలిని సైతం వుదాసించి తను ఏమి పోగొట్టుకుంటుంన్నాడో కూడా తెలియని పరిస్థితులలో కనిపిస్తారు. ఎట్టి మనిషైనా మంచితనం వున్నవాడైనా అవకాసం వచినప్పుడు పెడదోవ పడితే ఎవ్వరు వారిని కాపాడలేరు అనడానికి ఈ పాత్ర ఒక ఉదాహరణ. పైగా వేటినైతే చులకనగా పట్టించుకోమో అవే పెను భూతమై మనమీద భారమై కూర్చుంటాయి అనే ముగింపు అలాంటివారికి ఓ గుణపాఠం.





సుశీల :


సుశీల పాత్ర చాలా గొప్పది. ఇల్లాలిగా తన బర్తకు సేవలు చేస్తూ. జానకమ్మ గారికి చేతోడు వాదోడుగా వుంటూ. తన ఇష్టా ఇష్టాలను సైతం వదులుకొని జీవితాన్ని గడిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిస్వార్ధపరురాలు. జానకమ్మగారైనా తన స్వార్ధం కోసం వారిని ఆదరించారని చెపచ్చు కాని. సుశీల ఎటువంటిది ఆశించక జానకమ్మ గారికి సేవలు చేసింది. ఇలాంటి బార్యను పట్టించుకోని భర్త కష్టాల పాలు కాక తప్పదు. కాని చివర సుశీల పడిన మానసిక క్షోభ కాస్త బాధపెట్టింది. మంచివారికి కాలం లేదు.





నీతి :


జీవితం మధ్యలో వచ్చే భోగాలకు మోసపోయి జీవితాన్నే వదులుకోకూడదు.





మొత్తానికి రచయిత గారు చాలా చక్కగా కథను అందించారు. ఇది కథ కాదు మన నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవమే అని కూడా చెపచ్చు. వింజమూరి అచ్యుతరామయ్య గారికి మా ధన్యవాదాలు .





"లోకా సమస్తా సుఖినో భవంతు"








తీరని ఆశలన్నీ నీరుగా










కన్నీరు తాకిన చేతులు తడి ఆరలేదింక

ఆ తడి మాటున కథ తీరలేదింక

కంటి పాపకి తీరని ఆశలన్నీ నీరుగా

చెప్పుకోలేని బాధలన్నీ మౌనంతో తీర్చెనిలా...


మానవత్వం










పరుల కన్నీరు నీ కనులను తడిపితే

నీ మనసుకు ఆలోచన ఉన్నట్టు

వారి కష్టాలు నీకు బాధ్యత నేర్పితే

నీలో ఓ గొప్ప నాయకుడు ఉన్నట్టు

చేయి కదుపుతూ సాయం చేస్తే

నీలో మానవత్వం ఉన్నట్టు




ఇది శశి ప్రపంచం: need a law point please help us




post author: sasikala





please go through the following link for more information




ఇది శశి ప్రపంచం: "లా"వొక్కింత కావాలి ప్లీజ్......: ఈ రోజు ఒక ఆర్టికల్ చదివాను. మరియమ్మ అనే ఆవిడ పేదది అయినా ముసలి వాళ్ళని చేరదీసి వాళ్లకు అడుక్కొని తీసుకు వచ్చి ఇంత అన్నం పెడుతుంది. పెట్టినా...




sakshi paper link about that article: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=29923&Categoryid=11&subcatid=21

జై జవాన్







నా తరపున సుభ గారి తరపున అందరికి గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు




నాలోని ప్రాణం నీవే

నాలోని ధైర్యం నీవే

నావెనుక సైన్యం నీవే భారత దేశం


నాలోని ఉప్పెన నీవే

నాలోని ఆవేశం నీవే

నాకున్న శకలం నీవే భారత దేశం



నీవిచ్చిన ప్రాణం కాదది వరమనుకుంటున్నా

నీకంటూ ఇస్తూనే చరిత్రనైపోనా

నీవే ఒక యుగమైతే

ప్రతినిమిషం నేనౌతా

కవచంలా కౌగిలిస్తూ

ప్రేమను అందిస్తా



నలుదిక్కుల మానవహారం

నీమెడలో పూలహారం

నీవే మా దేవత వంటూ పూజలు చేస్తున్నాం

త్యాగాన్నే కోరికచేస్తూ నీకర్పిస్తున్నాం

మాలోని రక్తపు బొట్టుకు మావారిని కాపాడు

చిరునవ్వులు పంచుతూ చిరకాలం తోడుండు



ఓ తల్లిగా కన్నీరే

చిందించిన మాకోసం

దిగులే పడకు ఎన్నడూ

మరు జన్మ ఉంటే నీతోనే

ఎంత దూరం మా పయనం నీ గర్బంలోకే కదా
ప్రాణమిస్తే మరు క్షణం నీ బిడ్డలమౌతాం కదా

నీ ఒడిలో చోటిస్తూ లాలించు నను ఓదార్చు

ఈ బాధను మరిచేలా నీ ఎదపై ఆడించు





పట్టుదలతో అడుగు వేయి










సుడిగాలై పయనించే చిరుగాలికి

ఎందుకింత కష్టమో

ఆ వేగాన్ని ప్రశ్నించే కాలానికి

కఠినమైన మనసేమో

సాగాలి నీ పయనం విజయ తీరాలకు

పట్టుదలతో అడుగు వేయి పట్టు విడవకుండా

తనువులోకి తీసుకురా మనసులోని బలమంతా

ఆపై ఏ అడ్డు నిను తాకకుండా మా స్నేహం నీకు తోడు.....




తోపుడు బండి










తోపుడు బండి తోపుడు బండి

నాలుగు కాళ్ళు తిరిగే బండి

ఆనాడు ఇది రధమండి

ఇప్పుడేమో జీవనమండి

బరువు ఎంతైనా మోయునండి

కొనేవారికి వస్తువులండి

పేదవానికి కిరాయిబండి

బండికి కష్టం ఏమి లేదండి

గాలి చాలు మరి పరిగెత్తునండి.....




సంక్రాంతి పాపకు జోల పాట








పండగ వేళాయే పాపకు కొత్త ఊయల...

బొమ్మల కొలువాయే అ బొమ్మలు నీకట....

బసవన్న ఆటలు నీకు కాలక్షేపమాట...

బుడబుక్కలోడొచ్చినా బయమే లేదట..

నిన్ను చల్లగ కాచుకోనీకి అ బోగి మంటలట..

ఈ సంక్రాంతి నీకు జోల పాడునట..

నిదుర పో బోగి పండ్ల నీడన నిదురపో ఈ చల్లని లాలి ఒడిన....



సంక్రాంతి శుభాకాంక్షలు


నా తరపున మరియు కడలి సుభ గారి తరపున అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ పంటలను .. నదీ జలాలను .. సమృద్ధి పరచాలని , రైతన్నలను కాపాడాలని , వారి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుకుందాము.







































ఒడిసి పట్టు విజయాన్ని












చిరు గాలి మళ్ళింది విజయ తీరాల వైపు

సుడిగాలిలా మారి తన ప్రయత్నాల వైపు

ఆ పయనం ఎప్పటికి అంతులేనిది

ఇంకే ఆలోచనకు తావులేనిది

కష్టమైనా కఠినంగా వ్యవహరిస్తోంది

ఐనా తను ఉన్నానంటూ నమ్మకాన్ని వదిలి వెళ్ళింది

నాలోమాటగా దానికి ప్రోత్సాహం అందిస్తూన్నా

తను చెప్పుకున్న మాటకోసం లక్ష్యాన్ని చేదించేవరకు ..




హార్లిక్స్ కారపొడి








.





హార్లిక్స్ కారపొడి

బూస్ట్ ఉప్పు

త్రీరోసెస్ మిరియాలు

బ్రూ ఆవాలు

స్వీటక్స్ పసుపు

కార్డిలైట్ బిస్కెట్లు

బోర్న్ విటా నూనె

సన్ ఫ్లవర్ మరమరాలు

కాంప్లాన్ నెయ్యి

నరసూస్ కందిపప్పు

తాజ్మహల్ మెంతులు

బ్రిటానియా మురుకులు

గ్రీన్ టీ గస గసాలు

ఇలా ఎన్నో వంటిట్లో లేని కంపెనీలు ఉండవు

అ కంపెనీలు తయారుచేయని కొత్త కొత్త సరుకులు చూడచ్చు ..


పదిలమే నీ స్నేహం..















తెలియని భావన కనులలో కన్నీరా లేక పెదవిపై చిరునవ్వును పలికించాలా అన్నది నాలో తెలియని భావన ...

చెరిగిపోయిన దూరం సంతోషపెట్టినా చెదరని ఈ మౌనం నన్ను వేధిస్తోంది...

వెన్నల పర్వంలోని హాయి గుర్తొచ్చినా దానికి నిదుర నన్ను దూరం చేస్తుందేమో అన్న కలవరం నన్ను తొలచి వేస్తోంది...

మెత్తని ముసుగుల వెనుక ముళ్ళ కానుకగా ఈ సమయం వీడని రహస్యంలా వేధించే ఈ అల్లరి గాయం...

ఈ దూరం వీడుతుందని తెలిసిన ప్రస్తుతానికి ఓ సంశయం ఆగని గుండెలో ఎప్పటికి పదిలమే నీ స్నేహం...




వెన్నల వేకువై నను చేరేదెప్పుడో...










ఇంకా ఎంతకాలం ఈ ఉదయానికి

క్షణాలను ఎంచుతున్నా గడిచిపోతోంది

తారల లెక్కలు తీరిపోతోంది

కాని మసక చీకటి మత్తు వదిలేదెప్పుడో

వెన్నల వేకువై నను చేరేదెప్పుడో...


అగరవత్తి



















తలకు నిపెట్టినా పరిమళాలు చిందిస్తూ...

పరవశించే మనసుకు పరమాత్మకు వారధిగా...

తాను బూడిదై రాలిపోతున్నా గుబాళిస్తూ...

మంచి గుణముతో వెలిగిపోయేనీ అగరవత్తి....


మాట మౌనం
















వెలుగు చీకటి నడుమ ఉన్న సంధ్య నే అందము

నింగి నేల మధ్య ఆ చందమామ అందము

వయసు అనుభవం మధ్యనున్న పరువమే అందము

స్నేహము దూరము మధ్యనున్న చెరువే అందము

మాటకు మౌనానికీ నడుమ అ ఎదురుచూపులే అందము



నూతన సంవత్సర శుభాకాంక్షలు


అధరకండి బెధరకండి ఇంట్లో అందరు నిదుర లేస్తారు అనే నెపముతో మెల్లగా గుస గుసలాడవలసివచ్చింది :)
























గాలిని అడుగు

గాలిని అడుగు నీ అందం గురించి ఎంత మంది గుసగుసలాడుతున్నారో చెబుతుంది.. Ask the wind; it will show you the countless whisperers talking about y...